Slider హైదరాబాద్

ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌పోలీసులు, ఈసీ

Bhandi Sanjay

జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు ప్ర‌జాస్వామ్య యుతంగా నిర్వ‌హించాల‌నే తాము కోరుకుంటున్నామ‌ని కానీ పోలీసులు, ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ అధికారులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని బీజేపీ రాష్ర్ట అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆరోపించారు. మైలార్‌దేవ్‌ప‌ల్లిలో రూ. 40 ల‌క్ష‌ల‌ను త‌మ కార్య‌క‌ర్త‌లు ప‌ట్టుకుంటే క‌నీసం కేసును కూడా పోలీసులు బుక్ చేయ‌లేద‌ని ఆరోపించారు. అలాగే మ‌న్సూరాబాద్‌లో సాక్షాత్తూ మంత్రే ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచుతున్నార‌ని చెప్పినా పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో రాబోయేది బీజేపీ ప్ర‌భుత్వ‌మ‌ని బండి స్ప‌ష్టం చేశారు. పోలీసులు, ఈసీ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ముఖ్యంగా డీజీపీని బ‌దిలీ చేయాల‌న్నారు. లేదంటే తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని హెచ్చ‌రించారు.ఏదైనా జ‌ర‌గ‌రానికి జ‌రిగితే వారిదే బాధ్య‌త అని హెచ్చ‌రించారు. ఓ వైపు బీజేపీ కార్య‌క‌ర్త‌లు నాయ‌కులు డ‌బ్బులు పంచుతున్న టీఆర్ఎస్ నాయ‌కుల‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంటే వారిని కాకుండా త‌మ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌నే పోలీసులు వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని ఆరోపించారు. ఈ విష‌యంపై గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి ఫిర్యాదు చేస్తామ‌ని బండి సంజ‌య్ పేర్కొన్నారు.

Related posts

అనుక్షణం సేవ చేస్తున్న పోలీసులకు, ఆశాలకు మజ్జిగ పంపిణి

Satyam NEWS

వనదేవతలను సందర్శించిన ములుగు నూతన ఎస్ పి

Satyam NEWS

వజ్రోత్సవం నిర్వహించే హక్కు కాంగ్రెస్ కు మాత్రమే ఉంది

Satyam NEWS

Leave a Comment