37.7 C
Hyderabad
May 4, 2024 11: 53 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీశైలం లో  ఆర్య వైశ్యుల నిత్యాన్నదాన సత్రం పాక్షికంగా కూల్చివేత 

#vasavisatram

కూల్చివేతల పర్వంలో భాగంగానా అన్నట్టు శ్రీశైలం లో  ఆర్య వైశ్యుల  ఆరాధ్య దైవం అయిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ వారి నిత్య అన్నదానం సత్రం కూల్చివేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్యులు జరిగింది తెలుసుకుని తీవ్రంగా మదనపడుతున్నారు. శ్రీశైలం లోని ఆర్య వైశ్యుల సత్రం చాలా కాలంగా భక్తులకు ఆశ్రయం కల్పిస్తున్నది. అక్కడ జరిగే నిత్యాన్నదానం ఎంతో మంది ఆకలి తీరుస్తూ ఉంటుంది. రాష్ట్రంలోని ఆర్య వైశ్యులందరికి అది ఒక సెంటిమెంట్ తో కూడుకున్న ఆలయం వంటిది.

అలాంటి సత్రాన్ని అధికారులు కూల్చి వేశారు. రాజకీయంగా ఇప్పటికే ఆర్య వైశ్యులను అణగదొక్కుతున్న వైసీపీ ఇప్పుడు తమ సెంటిమెంటును కూడా కూల్చి వేసిందని రాష్ట్రంలోని ఆర్య వైశ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల కొండపై మాడ వీధుల తరహాలో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మాడ వీధులకు రూప కల్పన చేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. దీనిలో భాగంగా దేవస్థానానికి ఇరువైపులా ఉన్న దుకాణాలను తొలగించాలని కొద్ది రోజుల క్రితం వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలోనే ఆర్యవైశ్య సత్రం విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. సత్రం ముందు కొంత భాగాన్ని కూల్చాలని నిర్ణయించారు. అయితే ఆ సమయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఉన్నందున, శివరాత్రి వేడుకలు ముగిసిన తర్వాత కూల్చివేత కార్యక్రమం చేపట్టాలని ఆర్యవైశ్యులు అధికారులను కోరారు. ఇప్పుడు శివరాత్రి పూర్తి అయినందున వాసవి సత్రంలోని భాగాలను కూల్చి వేశారు. స్థానికంగా ఉన్న ఆర్య వైశ్యలు పలు కారణాలతో అధికారులకు సహకరిస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్యులు మాత్రం ఈ చర్య తో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

Related posts

కాకినాడ సంఘటన పట్ల గవర్నర్ దిగ్భ్రాంతి

Bhavani

నేపాల్ భూ భాగాన్ని ఆక్రమించిన చైనా?

Satyam NEWS

ఎలుగుబంటి దాడిలో ఇద్దరికి గాయాలు

Satyam NEWS

Leave a Comment