36.2 C
Hyderabad
May 7, 2024 12: 37 PM
Slider విజయనగరం

మహిళా దినోత్సవం సందర్భంగా మానవహారం

#manavijayanagaram

విజయనగరంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు ప్రారంభం అయ్యాయి. నగరం మొత్తం మానవహారంగా ఏర్పడ్డారు… వేలాది మంది విద్యార్థులు, మహిళ సంఘాల మహిళలు, సచివాలయ మహిళా ఉద్యోగులు తదితరులు. వాహనంపై నుంచి ర్యాలీగా సాగి గౌరవ వందనం స్వీకరించారు జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, జిల్లా ఎస్పీ దీపికా ఎం. పాటిల్ లు.

ఈ ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి విజయ నగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియం వరకు 8 కి.మి. మేర  ర్యాలీ, మానవహారం కొనసాగాయి. దారి పొడువునా నినాదాలు ఇస్తూ.. అతిథులకు స్వాగతం పలికారు విద్యార్థులు, మహిళలు. ఈ ఏడాది ప్రత్యేకంగా ఓపెన్ టాప్ వాహనంపై కలెక్టర్, ఎస్పీలతో పాటు నిల్చొని గౌరవ వందనం స్వీకరించారు.. జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్. భారీగా తరలి వచ్చారు వివిధ సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేట్ శాఖలకు చెందిన మహిళా సభ్యులు, వివిధ పాఠశాలల విద్యార్థులు.

అలాగే ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించిన పోలీస్ శాఖ అధికారులు. ఇక ర్యాలీలో భాగస్వామ్యులయ్యారు. వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు. ర్యాలీ అనంతరం స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియం ప్రాంగణంలో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసారు కలెక్టర్ ఎ. సూర్య కుమారి, ఎస్పీ దీపికా ఎం. పాటిల్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్.

Related posts

రెండు చోట్ల విజయనగరం పోలీస్ బాస్ జెండా ఆవిష్క‌ర‌ణ‌….!

Satyam NEWS

చట్టం ఉల్లంఘిస్తే పోలీసులు బోనులో నిలబడాల్సి వస్తుంది

Satyam NEWS

రాహుల్ కు వచ్చే ఎన్నికల్లో పోటీకి అర్హత ఉంటుందా?

Satyam NEWS

Leave a Comment