30.7 C
Hyderabad
May 5, 2024 04: 58 AM
Slider ప్రత్యేకం

అశోక్ గజపతి రాజు రూపంలో జగన్ కు మరో షాక్

#AsokgajapatiRaju

వై ఎస్ జగన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వానికి ఈ సారి అశోక్ గజపతి రాజు రూపంలో షాక్ తగిలింది.

ఈ నెల 2 వ తేదీన మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ని ప్రముఖ దేవస్థానాలు అయిన నెల్లిమర్ల రామతీర్థం , విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవస్థానం, తూర్పుగోదావరి జిల్లా లోని మండపల్లి లోని మండేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపక చైర్మన్ గా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అశోక్ గజపతి రాజు హైకోర్టు కి వెళ్లారు. గురువారం మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు కి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అశోక్ ని వ్యవస్థాపక చైర్మన్ గా తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ. ని హైకోర్టు కొట్టివేసింది.

మూడు దేవాలయాలు కి అశోక్  గజపతి రాజు ని వ్యవస్థాపక చైర్మన్ గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జరిచేశారు. దీంతో మూడు దేవాలయాలు కి వ్యవస్థాపక చైర్మన్ గా ఆయన కొనసాగనున్నారు.

హైకోర్టు తీర్పు పై స్పందించిన అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ రామతీర్ధాలు అనువంశిక ధర్మకర్తగా నన్ను తొలగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్ట్ వారు ఈ రోజు కొట్టివేశారు.

రామతీర్ధాలులో నూతన విగ్రహ ప్రతిష్ట జరిగిన శుభదినాన ఆ శ్రీ రామచంద్రుడే నన్ను ఆశీర్వదించి ఆయనకు సేవ చేసుకొనే భాగ్యాన్ని మళ్ళీ కలిగించారని భావిస్తున్నాను అని తెలిపారు.

Related posts

కొన ఊపిరితో ఉన్న సినిమా గొంతు నొక్కేశారు….

Satyam NEWS

శ్రీవాణి ట్రస్టు నిధులతో కపిలేశ్వర రిజర్వాయర్ నిర్మించాలి

Bhavani

కొత్తగూడెం డిఎస్పీగా రెహమాన్

Murali Krishna

Leave a Comment