37.7 C
Hyderabad
May 4, 2024 13: 22 PM
Slider నల్గొండ

వడదెబ్బ నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం

#orspackets

సూర్యాపేట జిల్లా కలెక్టర్,డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు మఠంపల్లి మండల అన్ని గ్రామాలలో ఓఆర్ఎస్ సెంటర్లను ఏర్పాటు చేశామని, గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్,గ్రామ పంచాయతీలు,ఐకెపి సెంటర్,ఆశా వర్కర్ల గృహాలను కూడా ఓఆర్ఎస్ సబ్ సెంటర్లుగా పెట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ ఫిరోజ్  తెలిపారు.

ప్రతీ ఒక్కరూ ఎండలో పని చేయవద్దని,చేయవల్సి వస్తే తల మీద ఎండ పడకుండా చూసుకోవాలని, మంచి నీరు ఎక్కువగా తాగాలని,వీటితో పాటుగా ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవాలని,డాక్టర్ ఫిరోజ్ ఒక ప్రకటనలో తెలిపారు. బయట పనికి వెళ్లే వారు ఉదయం,సాయంత్రం మాత్రమే పని చూసుకుని మధ్యాహ్నం వేళలో విశ్రాంతి తీసుకునేలా చూసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశాలు, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పై రేప్ కేసు

Bhavani

విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప‌ యాత్ర‌లో పాల్గొన్న కేంద్ర‌ మంత్రి

Satyam NEWS

ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం మహిళా పోలీసులకు ఆన్లైన్ పరీక్ష

Satyam NEWS

Leave a Comment