26.7 C
Hyderabad
April 27, 2024 10: 44 AM
Slider ముఖ్యంశాలు

ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం మహిళా పోలీసులకు ఆన్లైన్ పరీక్ష

#vijayanagarampolice

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న మహిళా పోలీసులకు ప్రొబేషన్ డిక్లేర్  చేసేందుకు జొన్నాడలోని లెండీ ఇంజనీరింగు కళాశాలలో నిర్వహించిన ఆన్ లైను పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఎం దీపిక  సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ – జిల్లాలో పని చేస్తున్న 745మంది మహిళా పోలీసులకు ప్రొబేషన్ డిక్లేర్ చేసేందుకు ఆన్ లైన్ పరీక్షను  రెండు రోజులపాటు లెండీ ఇంజనీరింగు కళాశాలో నిర్వహిస్తున్నామన్నారు. మహిళా పోలీసులు క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు అవసరమైన ప్రాజెక్టు వర్కును గత వారం రోజులుగా నిర్వహించి, మహిళలకు దిశా యాప్ పట్ల అవగాహన కల్పించడం, డౌన్ లోడ్ చేయించడం,జరిగిందన్నారు.

అలాగే మహిళల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించడం, సున్నిత ప్రాంతాలను మ్యాపింగ్ చేయడం, మహిళామిత్ర గ్రూపులను ఏర్పాటు చేయడం, సమాచార సేకరణ, యువత పై సోషల్ మీడియా ప్రభావం, శాంతిభద్రతల సమస్యలను పరిష్కరించే విధానం, సాంఘిక దురాచారాలను పారదోలుటకు చేయాల్సిన కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించామన్నారు. ఇంత వరకు క్షేత్ర స్థాయిలో మహిళా పోలీసులు నేర్చుకొన్న అంశాలపైన ఆన్ లైను పరీక్షను నిర్వహించి, పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ప్రొబేషన్ డిక్లరేషన్ చేయనున్నామన్నారు.

మహిళా పోలీసులు పోలీసు ఉద్యోగులు వలే ప్రతీ రోజూ యూనిఫారంను ధరించాల్సిన అవసరం లేదని, వారు సచివాలయంలోనే విధులు నిర్వహించ వచ్చునని, అత్యవసర సమయాల్లో మినహా రాత్రిపూట విధులు నిర్వహించాల్సిన అవసరం ఉండదన్నారు. ఆన్లైను

పరీక్ష అనంతరం ఉమెన్ ఫ్రెండ్లీగా శిక్షణ కూడా నిర్వహిస్తామని మహిళా పోలీసులకు జిల్లా ఎస్పీ తెలిపి, వారి సందేహాలను నివృత్తి చేసారు. పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు ప్రాంతాల నుండి జొన్నాడ వద్ద లెండీ ఇంజనీరింగు కళాశాలలోని పరీక్షా కేంద్రానికి మహిళా పోలీసులు వచ్చేందుకు ప్రత్యేకంగా ఆర్టీసి బస్సులను కూడా పోలీసుశాఖ ఏర్పాటు చేసినట్లుగా జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు.

విధి నిర్వహణపై ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే, వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి, పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ దీపిక మహిళా పోలీసులకు భరోసా కల్పించారు.జిల్లా ఎస్పీ వెంట భోగాపురం సీఐ సిహెచ్.శ్రీధర్, డీటీసీ సీఐ రాజశేఖరరావు మరియు ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.

Related posts

High alert: టెర్రర్ లింక్ కారణంగా పిఎఫ్ఐ పై నిషేధం  

Satyam NEWS

డెకాయిట్లు కూడా చేయని విధంగా వైసీపీ అక్రమాలు

Satyam NEWS

వైశాఖ మాసంలో శ్రీకాకుళం వెంకటేశ్వర ఆలయ ప్రతిష్ట

Satyam NEWS

Leave a Comment