31.2 C
Hyderabad
May 3, 2024 02: 48 AM
Slider ప్రత్యేకం

విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప‌ యాత్ర‌లో పాల్గొన్న కేంద్ర‌ మంత్రి

#asvinivaishnav

విశాఖ‌-కిరండోల్ ఎక్స్‌ప్రెస్‌కు ఎస్‌.కోట‌లో హాల్టు : ఎస్‌.కోట నియోజ‌క‌వ‌ర్గానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌ వ‌రాలు

దేశ ప్ర‌జ‌లంద‌రి స‌హ‌కారంతో భార‌త్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాల‌న్న సంక‌ల్పంతోనే దేశ ప్ర‌ధాన‌మంత్రి  న‌రేంద్ర‌మోడి పనిచేస్తున్నార‌ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ చెప్పారు. దేశంలోని ప్ర‌తి వ్య‌క్తిలో, ప్ర‌తి గ్రామంలో ప్ర‌తి కుటుంబంలో కొత్త ఉత్సాహం తీసుకురావ‌డం ద్వారా అభివృద్ది చెందిన దేశంగా తీసుకురావ‌డ‌మే ముఖ్య ఉద్దేశ్య‌మ‌న్నారు. అంద‌రి తోడుతో అంద‌రి అభివృద్ధి సాధిస్తూ అంద‌రి విశ్వాసం(స‌బ్ కా సాత్‌, స‌బ్ కా వికాస్‌, స‌బ్ కా విశ్వాస్‌) పొందాల‌న్న‌ది ప్ర‌ధాన‌మంత్రి  మోడి  ముఖ్య ఉద్దేశ్య‌మ‌ని పేర్కొన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వ స‌హాయంతో ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతోపాటు వాటిని అర్హులైన వారికి నూరుశాతం అందించే ల‌క్ష్యంతో చేప‌ట్టిన విక‌సిత్ భార‌త సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా వేపాడ మండ‌లం వీలుప‌ర్తిలో  జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కేంద్ర రైల్వేమంత్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌ మాట్లాడుతూ కేంద్రంలో  న‌రేంద్ర‌మోడి ప్ర‌ధాన‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం గ‌త తొమ్మిదిన్న‌రేళ్ల కాలంలో దేశంలో ప్ర‌తి కుటుంబానికి ఏదో ఒక ప్ర‌యోజ‌నం చేకూరింద‌న్నారు.

ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో మాత్ర‌మే వుండే ఇంటింటికీ కొళాయిల ద్వారా నీటి స‌ర‌ఫ‌రాను,  గ్రామీణ ప్రాంతాల్లోనూ అందించ‌డ‌మనేది ఎవ‌రూ ఎన్న‌డూ ఊహించ‌లేద‌ని, దీనిని ప్ర‌ధాన‌మంత్రి సాధ్యంచేసి చూపించార‌ని పేర్కొన్నారు. కోవిడ్ స‌మ‌యంలో రెండు విడ‌త‌లుగా ప్ర‌తి వ్య‌క్తికి ఇచ్చిన వ్యాక్సిన్ ఎంద‌రికో ఆరోగ్య సంర‌క్ష‌ణ క‌లిగించింద‌న్నారు.

గ‌తంలో ఇంట్లో ఎవ‌రైనా అనారోగ్యం పాలైతే ఆసుప‌త్రిలో చేర్పించాల్సి వ‌స్తే ఆ ఖ‌ర్చులు ఎలా భ‌రించాల‌నే ఆందోళ‌న వుండేదిన‌, ఆయుష్మాన్ భార‌త్ కార్డు ద్వారా 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆరోగ్య బీమా సౌక‌ర్యాన్ని మోడీ ప్ర‌భుత్వం క‌ల్పించింద‌న్నారు. ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తీర్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ద్వారా వివిధ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా పి.ఎం.ఉజ్జ్వ‌ల యోజ‌న గ్యాస్ ప‌థ‌కం ఎంత‌మంది అందుకున్నార‌ని కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మ‌హిళ‌ల‌ను అడిగి మంత్రి తెలుసుకున్నారు. కోవిడ్ స‌మ‌యంలో ఎంత‌మంది రెండు ద‌పాలుగా టీకాలు వేసుకున్నార‌ని ప్ర‌శ్నించారు. దీనికి బ‌దులుగా అంద‌రూ చేతులు పైకెత్తి తెలిపారు. రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో ఎన్నో సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల‌ను రాష్ట్రంలో  ముఖ్య‌మంత్రి .జ‌గ‌న్  ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తోంద‌న్నారు. రాష్ట్రంలో వలంటీర్లు, స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా అర్హులైన ప్ర‌తి కుటుంబానికి సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నామ‌ని చెప్పారు.

జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.నాగ‌ల‌క్ష్మి మాట్లాడుతూ జిల్లాలో న‌వంబ‌రు 25 నుంచి విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప‌యాత్ర నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు 156 గ్రామాల్లో ఈ యాత్ర పూర్త‌య్యింద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను తెలియ‌జేయ‌డంతోపాటు అర్హులంద‌రికీ శ‌త‌శాతం అందించేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని పేర్కొన్నారు. రైతులు త‌దిత‌ర వ‌ర్గాల వారికి ప‌లు ప‌థ‌కాల కింద ప్ర‌యోజ‌నాల‌ను కూడా యీ కార్య‌క్ర‌మం ద్వారా అందిస్తున్నామ‌ని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జా జీవ‌న ప్ర‌మాణాలు పెంచేందుకు గ‌త నాలుగున్న‌రేళ్లుగా ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాయ‌ని ఎస్‌.కోట ఎమ్మెల్యే క‌డుబండి శ్రీ‌నివాస‌రావు చెప్పారు. రాష్ట్రంలో గ్రామ స్థాయిలో ఏర్పాటైన ప‌రిపాల‌న వ్య‌వ‌స్థ‌ల వ‌ల్ల ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు అందించడం సులువైంద‌న్నారు.

ఎస్‌.కోట నియోజ‌క‌వ‌ర్గానికి రైల్వేమంత్రి వ‌రాలు…!

నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్ ప‌లు వ‌రాలు ప్ర‌క‌టించారు. కొత్త‌వ‌ల‌స రైల్వేస్టేష‌న్ ను ప్ర‌పంచ‌స్థాయి రైల్వేస్టేష‌న్‌గా తీర్చిదిద్దుతామ‌ని ప్ర‌క‌టించారు. కె.కె.లైన్‌ను డ‌బుల్ లైన్‌గా మార్పు చేస్తున్న‌ట్టు చెప్పారు. దీనివ‌ల్ల ఈ మార్గంలో రైళ్ల రాక‌పోక‌లు పెరిగి అభివృద్ధి చెందేందుకు మ‌రింత అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌న్నారు. విశాఖ – కిరండోల్ ఎక్స్‌ప్రెస్ రైలును ఎస్‌.కోట రైల్వే స్టేష‌నులో నిలిపేందుకు చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని కేంద్ర మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల‌కు కేటాయిస్తున్న నిధుల‌ను గ‌ణ‌నీయంగా పెంచామ‌ని కేంద్ర రైల్వే మంత్రి చెప్పారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే రాష్ట్రంలో రైల్వేల ప్రాజెక్టుల కోసం 800 బ‌డ్జెట్ కేటాయించ‌గా, విభ‌జ‌న అనంత‌రం ఏర్ప‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 8000 కోట్లు కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా జిల్లాలోని ప్ర‌భుత్వ శాఖ‌లు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఆయా స్టాళ్ల‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్ సంద‌ర్శించారు. వైద్య ఆరోగ్య‌శాఖ స్టాల్‌ను సంద‌ర్శించి నిక్ష‌య్ మిత్ర కింద టి.బి.రోగుల‌కు పౌష్టికాహారాన్ని అంద‌జేశారు. బ్యాంకుల ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను సంద‌ర్శించి ప్ర‌ధాన‌మంత్రి జీవ‌న‌జ్యోతి బీమాయోజ‌న‌, పి.బి.సుర‌క్ష బీమాయోజ‌న, ప్ర‌ధాన‌మంత్రి ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్ ప‌థ‌కాల కింద ల‌బ్దిదారుల‌కు చెక్కులు అంద‌జేశారు. వ్య‌వ‌సాయ శాఖ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌లో భూఆరోగ్య కార్డులు అంద‌జేశారు. పి.ఎం. ఉజ్జ్వ‌ల యోజ‌న కింద ప‌లువురు ల‌బ్దిదారుల‌కు గ్యాస్ క‌నెక్ష‌న్లు అంద‌జేశారు. పి.ఎం.పోష‌ణ యోజ‌న స్టాల్‌ను సంద‌ర్శించి మ‌హిళాశిశు సంక్షేమ శాఖ‌ ద్వారా అంగ‌న్‌వాడీ సిబ్బంది త‌యారుచేసిన బూరెలు త‌దిత‌ర వంట ప‌దార్ధాల‌ను రుచి చూసి బాగున్నాయంటూ మెచ్చుకున్నారు.

విక‌సిత్ భార‌త్ స్టాల్‌ను సంద‌ర్శించిన కేంద్ర మంత్రికి సెంట్ర‌ల్ బ్యూర్ ఆఫ్ క‌మ్యూనికేష‌న్స్ అధికారి బి.తార‌క‌ప్ర‌సాద్ కేంద్ర ప‌థ‌కాల ప్ర‌చార సామాగ్రి గురించి వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా విక‌సిత్ భార‌త్ క్యాలెండ‌ర్‌ను కేంద్ర రైల్వేమంత్రి, ఇత‌ర ప్ర‌ముఖులు ఆవిష్క‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లాప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, రాజ్య‌స‌భ స‌భ్యులు జివిఎల్ న‌ర‌సింహారావు, తూర్పుకోస్తా రైల్వే జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, విశాఖ రైల్వే డి.ఆర్‌.ఎం. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

బుడ‌తనాప‌ల్లి విద్యార్ధికి జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ అవార్డు

Satyam NEWS

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి ఖాయం

Satyam NEWS

అవినీతిపరులను రక్షించేందుకు కేంద్రం మార్గదర్శకాలు

Satyam NEWS

Leave a Comment