40.2 C
Hyderabad
May 6, 2024 18: 05 PM
Slider మహబూబ్ నగర్

పల్లె, పట్టణ ప్రగతి పథకాలతో ‘చివరి మజిలీ’కి తీరిన చింత

#nagarkurnool

నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట పట్టణాల్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పటిష్టంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైకుంఠ ధామాల నిర్మాణం అత్యాధునిక హంగులతో శరవేగంగా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో సత్యంన్యూస్.నెట్ ప్రత్యేక కథనం:

చనిపోయినవాళ్లను దేవుళ్లతో సమానం అంటారు. అందుకే వాళ్లకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించటం మన సంప్రదాయం. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామానికో వైకుంఠధామాన్ని ఏర్పాటు చేయించింది. కులాలకు అతీతంగా అంతా ఒకే దగ్గర అంత్యక్రియలు చేసేలా శ్మశానవాటికల నిర్మాణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూపకల్పన చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో జిల్లా యంత్రాంగం అదే స్ఫూర్తితో యుద్ధ ప్రాతిపదికన గ్రామాల్లో 100% పనులు పూర్తి చేశారు. మున్సిపాలిటీల్లో శరవేగంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

ఉపాధి హామీ నిధులతో వైకుంఠ ధామాలు

జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రజలు స్మశాన వాటికలను వినియోగించుకుంటున్నారు. గ్రామపంచాయతీలో ఉపాధి హామీ నిధులతో ఒక్కో వైకుంఠధామానికి 12 లక్షల 60 వేల రూపాయలతో నిర్మాణాలు పూర్తి అయ్యాయి.

జిల్లా వ్యాప్తంగా 461 గ్రామపంచాయతీల్లో 461 వైకుంఠధామాల నిర్మాణాలు 100% పూర్తయ్యాయి. పల్లెప్రగతిలో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక్కో వైకుంఠధామాన్ని రూ.12.60లక్షల వ్యయంతో నిర్మించారు. దహన సంస్కారాల అనంతరం పూజ స్నానపు గదులు మరుగుదొడ్లు తోపాటు అదనపు ఏర్పాట్లు, ఇతర అవసరాలను, మరింత మెరుగైన సదుపాయాల కోసం గ్రామ పంచాయతీ నిధులను వాడుకొనేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

వీటికోసం రాష్ట్ర ప్రభుత్వం 58 కోట్ల 8 లక్షల 60 వేల రూపాయలు వెచ్చించింది. అన్ని రకాల వసతులు ఉండేలా ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా వీటిని జిల్లా అధికారులు నిర్మించారు.

నాగర్ కర్నూలు జిల్లాలో బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్, తాడూర్ మండలం మెడిపూర్, నాగర్ కర్నూల్ మండలం చందుపట్ల, గుడిపల్లి, కల్వకుర్తి మండలం వేల్పూరు, వెల్దండ మండల కేంద్రంలో, అన్ని మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రజలు, ప్రభుత్వం నిర్మించిన వైకుంఠ ధామాలను వినియోగించుకుంటున్నారు.

కుటుంబంలో వ్యక్తి చనిపోయినప్పుడు దహన సంస్కారాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్మశాన వాటికలో ఎంతో సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఉన్నాయని, ప్రతి గ్రామానికి ఇది తప్పనిసరిగా అవసరమని ప్రజలు అంటున్నారు. ప్రతి పట్టణాల్లో ఒక్కో వైకుంఠధామాలకు  కోటి రూపాయలతో అధునాతన హంగులతో ఏర్పాట్లు చేశారు.

పట్టణాల్లోనూ పెద్దఎత్తున అధునాతన హంగులతో వైకుంఠధామాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  పట్టణాల్లో వైకుంఠ రథాలను కూడా కొనాలని నిర్ణయించారు.

నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీల పరిధిలో  వైకుంఠ ధామాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

కొల్లాపూర్ పట్టణంలో మూడు కోట్ల రూపాయలతో 3 స్మశాన వాటిక లను, నాగర్ కర్నూల్, అచ్చంపేట కల్వకుర్తి పట్టణాల్లో ఒక్కో స్మశాన వాటికకు కోటి రూపాయలతో అధునాతన హంగులతో వైకుంఠ ధామాల ఒక్కో స్మశాన వాటిక ల వద్ద సువిశాల ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏక కాలంలో రెండు దహన సంస్కారాలు జరిగేలా నిర్మాణాల తోపాటు నాలుగు స్థానపు గదులు నాలుగు మరుగుదొడ్లు ప్రత్యేక పూజ గది, దింపుడు గాళ్ళ వద్ద ప్రత్యేక ఏర్పాట్లతో పట్టణాల్లో శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి.

ఊరిలో ఎవరన్నా చనిపోతే చెరువు గట్టుకో, వాగు పక్కనో కాల్చేవారు. భూములు ఉన్నవాళ్లు సొంత జాగాలో అంత్యక్రియలు నిర్వహిస్తే.. భూముల్లేని పేదలు, ఎస్సీలు, ఎస్టీలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కనీస సౌకర్యాలు లేకపోయేవి కావు. ఇప్పుడా గ్రామాల్లో ఆ పరిస్థితి లేదు. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైకుంఠధామాలతో నాగర్ కర్నూల్ జిల్లా ప్రతి పల్లెల్లో చివరిమజిలీ గౌరవప్రదంగా సాగుతున్నది.

ఇబ్బంది లేకుండా దహన సంస్కారాలు

గతంలో గ్రామంలో శ్మశానం లేక ప్రజలు చాలా కష్టాలు పడ్డారు. పల్లెప్రగతిలో చేపట్టిన వైకుంఠదా మంతో ఆ బాధ తీరింది. ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్లు గ్రామానికే వచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. స్నానాలు చేయటానికి నీటి ట్యాంకు తో పాటు బోర్లు వేయించాం. మా బిజినపల్లి మండలంలో ప్రజలు వినియోగించిన మొదటి వైకుంఠ దామం మాదే. ఇప్పటి వరకు 5 మంది దహన సంస్కారాలు జరిగాయని నంది వడ్డేమాన్ సర్పంచ్ వంగ సుదర్శన్ గౌడ్ తెలిపారు.

ప్రజలు  వైకుంఠ ధామాలు వినియోగించుకునేలా చర్యలు

గ్రామ పంచాయతీ కార్యదర్శులు సర్పంచులతో గ్రామాల్లో ఉన్న స్మశాన వాటిక లను వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పంచాయతీ అధికారిణి రాజేశ్వరి తెలిపారు. రానున్న రోజుల్లో భూమి విలువ మరింత పెరిగి దహన సంస్కారాలకు భూమి దొరకని సందర్భంలో దహన సంస్కారాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామాల్లో చివరి మజిలీ యాత్రకు ప్రజలు 100% వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం.

100% వినియోగమే లక్ష్యం

గ్రామానికో వైకుంఠధామం ఉండాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి అన్ని గ్రామాల్లో వైకుంఠదా మాలు నిర్మించటం దేశంలోనే మొదటిసారి అని ఆయన అన్నారు. గ్రామం లో అత్యవసరమైన వసతుల్లో ఇది ఒకటి. వీటిల్లో అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటుచేశాం. దాదాపు అన్ని గ్రామాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. అతి కొన్నిచోట్ల చివరి దశ నిర్మాణా పనులు కొనసాగుతున్నాయి అని ఆయన వివరించారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

మానవత్వాన్ని చాటుకున్న ఆర్య వైశ్యులు

Satyam NEWS

26, 27 తేదీల్లో బ్యాంకుల సమ్మె

Satyam NEWS

జొన్నాడ లో ఇసుక ర్యాంప్ ను పరిశీలించిన చంద్రబాబు

Satyam NEWS

Leave a Comment