Slider మహబూబ్ నగర్

మానవత్వాన్ని చాటుకున్న ఆర్య వైశ్యులు

#Kalwakurthy Fire Accedent

షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక వ్యక్తి ఇల్లు మొత్తం కాలిపోయి ఆయన కుటుంబం రోడ్డున పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆర్య వైశ్య సంఘం నాయకులు మానవత్వంతో అతడిని ఆదుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా జెట్ పోల్  గ్రామం లో ఈ సంఘటన జరిగింది గుంత శ్రీనివాస్ అనే వ్యక్తి ఇట్లు ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట సమయాన న షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోయింది.

దాదాపు 30 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరు లక్షల నగదు తో పాటు  విలువైన సామాగ్రి, ఇల్లు మొత్తం దగ్ధమైంది. నివసించడానికి పనికి రాకుండా కాలిపోవడంతో కట్టుబట్టలతో ఆయన రోడ్డున పడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర విద్యా కమిటీ చైర్మన్ మిడిదొడ్డి శ్యామ్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు విసనకర్ర చంద్రకుమార్  సోషల్ మీడియా ద్వారా అందరికి తెలుపడంతో కల్వకుర్తి ఆర్యవైశ్యుల అంతా తోచినంత సహాయం చేశారు.

విసనకర్ర చంద్రకుమార్ రూ.10,000 తల కొండ పల్లి జెడ్పిటిసి 20,000 నాగర్ కర్నూల్ క్లాస్మేట్స్ 10,000 ఇలా  జమ చేస్తూ ఆయనకు చేయూతను అందిస్తున్నారు.

Related posts

రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీల వివరాలు సేకరించాలి

Satyam NEWS

అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు

Satyam NEWS

‘నాలుగేళ్ల నరకం’ పేరుతో టీడీపీ కొత్త కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment