37.2 C
Hyderabad
May 6, 2024 20: 46 PM
Slider రంగారెడ్డి

ఎల్లారెడ్డి స్మశాన వాటికను రక్షిద్దాం, వైకుంఠధామంగా తీర్చిదిద్దుదాం

#bandarilaxmareddy

ఉప్పల్ ప్రాంతంలోని ఎల్లారెడ్డిగూడ స్మశానవాటిక పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని BLR చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్, టీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బండారి లక్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిగూడ గ్రామ సేవా సంఘం అధ్యక్షులు బైరి నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో  బండారి లక్మారెడ్డి స్థానిక పురాతన స్మశానవాటికను సందర్శించారు.

ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని 43 సర్వే నెంబర్ లో గల స్మశానవాటికను కొందరు కబ్జాకు యత్నిస్తున్నారని, ఆ స్థలాన్ని కబ్జా చెర నుంచి  రక్షించాలని గ్రామ సేవా సంఘం సభ్యులు, గ్రామస్తులు  ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. స్మశానవాటిక స్థలాన్ని దురాక్రమణకు గురి కాకుండా  స్వంత నిధులతో రక్షణ కంచెను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ ప్రజలు కులమతాలకు,  పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

స్మశానవాటికను వైకుంఠధామంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో  గ్రామ పెద్దలు , గ్రామ సేవ సంఘం సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

ఐదు గురు వరంగల్ వాసుల మృతదేహాలు లభ్యం

Satyam NEWS

గందరగోళం సృష్టించిన 22 A: అధికారులపై చర్య తీసుకోండి

Satyam NEWS

ఈ సారి అమర్ నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తుల నమోదు

Satyam NEWS

Leave a Comment