27.7 C
Hyderabad
May 7, 2024 08: 52 AM
Slider హైదరాబాద్

ప్రతి పేదవాడికి వైద్యం అందించేందుకే బస్తీ ద‌వాఖానాలు

#uppalmla

ప్రతి పేదవాడికి వైద్యం అందాలని నగరంలోని అన్ని బస్తీలలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన  మార్పును తీసుకొచ్చిందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ, నాచారం, చిల్కానగర్ డివిజన్ ల లోని బస్తి దవాఖాన లను నేడు ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా  స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణి దేవి, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, ఆర్డిఓ రవి తాసిల్దార్ గౌతమ్ కుమార్ స్థానిక  కార్పొరేటర్ లు శాంతి  సాయి జెంట్స్ శేఖర్ , బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో 350 బస్తి దవఖానల లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అందులో భాగంగానే నేడు 32 బస్తీ దవాఖానలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 226 బస్తి దావఖానలను ప్రారంభించామని, వివిధ టెస్టుల తో పాటు ఉచితంగా మందులను కూడా పొందవచ్చని అన్నారు. తెలంగాణలో కరోనా ప్రభావం పెద్దగా లేదని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కరోనా నియమాలను తప్పక పాటించాలని సూచించారు.

ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ బస్తీ దవాఖాన లతోపాటు రాష్ట్రంలో పల్లె దవాఖానా లను 4000 ప్రారంభిస్తున్నామని ఏ ఒక్క పేదవాడు ఆర్థిక ఇబ్బందులతో వైద్యానికి దూరం కాకూడదనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ నారాయణ, కాప్రా మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్,  ఉప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్  అరుణ కుమారి ,ప్రాజెక్ట్ ఆఫీసర్లు కిరణ్మయి ,సుధా, శేషు పద్మ ,సిగ్గ్బత్తుల, డాక్టర్లు సౌందర్య లత మెడికల్ సూపర్వైజర్ భోగా ప్రకాష్ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఈ ఈ  నాగేందర్ డి ఈ నిఖిల్ రెడ్డి ,నాగమణి, ఏ ఈలు కీర్తి, రాజ్ కుమార్  ,రాకేష్, ఎస్ డబ్ల్యు డి చందన, శానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్, టిఆర్ఎస్ నాయకులు గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్, నాచారం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మేకల ముత్యం రెడ్డి, చిల్కానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పల్లె నర్సింగ్ రావు  సాయి జన శేఖర్,బన్నలప్రవీణ్ ముదిరాజ్,లక్ష్మీనారాయణ, మనోహర్ , గాయం శ్రీధర్ రెడ్డి , నేర్థం భాస్కర్ గౌడ్, జల్లి మోహన్, పిట్టల నరేష్,పండ్ల కిషన్,  అకిటి బాల్ రెడ్డి, వి బి నరసింహ ,నంది కంటి శివ, కొంగల శ్రీధర్, పూర్ణచందర్, కొరాపాక అంజి, ఎర్రం శ్రీనివాస్ రెడ్డి , కట్ట బుచ్చన్న గౌడ్, రామకృష్ణ, మధుసూదన్ రెడ్డి , రాజశేఖర్, శివకుమార్, సుగుణాకర్ రావు, దేవులపల్లి యాదగిరి అశోక్ మహిళలు నిర్మల రెడ్డి, ప్రీతి రెడ్డి ,సుభద్ర సరిత, వైద్య బృందం సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

అసాంఘిక కార్యకలాపాలకు సీసీ కెమెరాలతో చెక్

Satyam NEWS

నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణే  మా లక్ష్యం

Satyam NEWS

గోదాములు సిద్ధం

Bhavani

Leave a Comment