30.2 C
Hyderabad
May 13, 2024 13: 28 PM
Slider వరంగల్

నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణే  మా లక్ష్యం

#gouseallam

స్వేచ్ఛ ,నిష్పక్షపాతంగా ఎన్నికలను  నిర్వహిణే తమ లక్ష్యమని ములుగు జిల్లా ఎస్ పి గౌష్ ఆలం  అన్నారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో  మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా. ఆయన మాట్లాడుతూ . ఆరు నెలల క్రితమే  ఎన్నికలకు సంబంధించి జిల్లా పోలీస్ అధికారులతో 8 సార్లు  సమావేశాలు నిర్వహించడం జరిగిందని ములుగు జిల్లా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో గల బీజాపూర్ జిల్లాతో సుమారు 100 కిలోమీటర్లు  అంతర్ రాష్ట్ర సరిహద్దు కలిగి ఉన్నందున జిల్లా ఎస్పీ స్థాయిలో రెండు సార్లు అంతర్ రాష్ట్ర సమావేశాలు జరిగాయని తెలిపారు.

అలాగే సబ్ డివిజన్ అధికారి, స్టేషన్ హౌస్ అధికారి స్థాయిలో కూడా పలు సమావేశాలు జరిగాయని 2 అంత రాష్ట్ర చెక్పోస్టులను  5 అంతర్ జిల్లా  చెక్ పోస్ట్ లను ప్రస్తుతం ఏర్పాటు చేయడం జరిగిందని దీని ద్వారా డ్రగ్స్,మద్యం,  నగదు,విలువైన లోహాల అక్రమ రవాణా పై  ఉక్కు పాదం మోపడం జరుగుతుందని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్  అక్టోబర్ 9న వెలువడినందున  వాటి మార్గదర్శకాలు చాలా కఠినంగా ఉంటాయని  అతిక్రమిస్తే కేసులు నమోదు చేయబడతాయని  ఎవరైనా అతిక్రమించినట్టు తెలిస్తే వారు సువిధ యాప్ ద్వారా  ఫిర్యాదు చేయవచ్చునని ఫిర్యాదుదారుల వివరాలను  అత్యంత గొప్యంగా ఉంచబడతాయని లేదా 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు  ఫిర్యాదు చేయవచ్చునని ఎస్పీ తెలియజేశారు.

అనంతరం  ,ఎస్పీ   మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్  మార్గదర్శకాలను  వివరిస్తూ – ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ప్రచారానికి అనుమతి ఉంటుందని  మావోయిస్ట్స్ ల హాని ఉన్న కొన్ని ప్రాంతాలలో సూర్యాస్తమయం  తర్వాత ప్రచారం చేయరాదని పోలీస్ శాఖ వారు ఇచ్చిన మార్గదర్శకాలను మాత్రమే పాటించాలని దీనికి నోడల్ ఆఫీసర్ గా డి ఎస్ పి రవీందర్ , మావోయిస్టు సంబంధిత అనుమతులకై ఓ ఎస్ డి  ఉంటారని తెలియజేశారు.

స్వేచ్ఛ , నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడంలో భాగంగా  పోలింగ్ స్టేషన్స్ వారీగా  కఠినత్వాన్ని అంచనా  వేయడం జరిగిందని దానికి అనుగుణంగా ప్రజలలో మనోధైర్యాన్ని నింపేలా  సి ఆర్ పి ఎఫ్ ప్రత్యేక బలగాలతో రూట్ మార్చ్ ఫ్లాగ్ మార్చ్ పెట్రోలింగ్  నిర్వహిస్తామని తెలియజేశారు.ఆధారాలు లేకుండా 50 వేలకు పైగా నగదు కలిగి ఉండి పట్టుబడితే   సీజ్ చేస్తామని, ఆధారాలతో గ్రీవెన్స్ కమిటీలో నిరూపిస్తే  వారి డబ్బులు వారికి తిరిగి ఇచ్చే అవకాశం ఉందనితెలియజేశారు.

ముఖ్యంగా  మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో అసత్య వార్తలు వచ్చినప్పుడు ముందుగా పోలీస్ వారిచే వివరణ తీసుకొని   ప్రచురించవలసిందిగా కోరారు. ఎన్నికలు సమీపిస్తున్నందున  1100 లీటర్ల ఐ డి మధ్యాన్ని స్వాధీనపరుచుకున్నామని, రౌడీ షీట్ సస్పెక్ట్ షీట్ ఉన్న 760 మందిని   250 మందిని ఇప్పటికే బైండోవర్ చేశామని తెలియజేస్తూ ఎన్నికలను స్వేచ్ఛ మరియు నిష్పక్షపాత  ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా ములుగు జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తున్నామని దానికి అనుగుణంగా సంసిద్ధంగా ఉన్నామని  తెలియజేశారు.

Related posts

స్టడీ టూర్: జమ్మూకశ్మీర్‌ కు కేంద్ర మంత్రుల కమిటీ

Satyam NEWS

ఏపీలో అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా

Satyam NEWS

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రాయచోటిలో మానవహారం

Satyam NEWS

Leave a Comment