34.7 C
Hyderabad
May 4, 2024 23: 16 PM
Slider విజయనగరం

విక‌లాంగుల ట్రై సైకిల్ క్రికెట్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఆంధ్ర టైగ‌ర్స్

#sports

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజ‌య‌న‌గ‌రం శివారు లోని గాజులరేగ సీతం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో  విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో ఆంధ్ర టైగర్స్ టీం విజేతగా నిలచి ట్రోఫీని కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, బెస్ట్ బ్యాట్స్ మాన్ గా అప్పలరాజు గెలిచారు.

మొత్తం 15 ఓవర్లలో  ఆంధ్ర టైగర్స్ 114 పరుగులు చేసి చండీగర్ లయన్స్ కు సవాల్ విసిరారు. చండీగడ్  లయన్స్ 88 పరుగులు చేసి  ఓటమి పాలయ్యారు..జిల్లాలో దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ జరగడం ఇదే మొదటిసారి  ఈ టోర్నమెంట్ లో  గెలుపొందిన విజేతలకు లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, సీతం కళాశాల డైరెక్టర్ మజ్జి శశి భూషణరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు బహుమతులు ప్రదానం చేసారు.

అంత‌కుముందు క్రీడాకురులనుద్దేశించి భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ విజయనగరం యూత్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను ఈ సంస్థ అధ్యక్ష ,కార్యదర్శులు చేస్తున్నారని తెలిపారు. క‌రోనా విజృంభణ సమయంలో ఈ ఫౌండేషన్ సేవలు ఎనలేనివని, తద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగునింపారన్నారు. క‌రోనా లోనే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్న విజయనగరం యూత్ ఫౌండేషన్ వంటి సంస్థల సహకారం సమాజానికి చాలా అవసరమని సీతం ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ మజ్జి శశిభూషణ్ రావు అన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు మాట్లాడుతూ, దివ్యాంగుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజు ఈ టోర్నమెంట్ నిర్వహించటం చాలా అభినందనీయమన్నారు. . ఈ కార్యక్రమంలో పౌండేషన్ అధ్యక్షులు షేక్ ఇల్తమాష్, కార్యదర్శి ఆంబులెన్స్ శివ సభ్యులు అనిల్ కుమార్ ,అశోక్ ,సమీర్ ,వంశీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మళ్లీ ఫ్యాన్స్ మనసు గెల్చుకున్న ధోని

Sub Editor

అమిత్ షా, ఆర్ఎస్ఎస్ లపై దిగ్విజయ్ పశ్రంసల జల్లు

Sub Editor

నకిలీ విత్తనాల నిందితుడు మదుసూధన్ రెడ్డిపై పి.డి. యాక్ట్

Satyam NEWS

Leave a Comment