Slider విజయనగరం

పోలీసు శాఖలో చిన్న కేడర్ ఉద్యోగికి బాస్ సత్కారం…

#homeguard

ఏపీ పోలీసు శాఖలో కానిస్టేబుల్ నుంచే సూపరింటెండెంట్ వరకు ప్రతీ ఒక్కరూ ఆ శాఖ కు బాధ్యులే. ఇక పదవీవిరమణ వచ్చే సరికి స్థాయి ని బట్టి వాళ్లు చేసే విధుల నిర్వహణ బట్టి..సత్కారాలు.. వీడ్కోలు నిర్వహించడం జరుగుతూ వస్తోన్న ఓ పద్దతి.

అయితే ఆదే పోలీసు శాఖ లో హోమ్ గార్డ్ అన్న చాలా చిన్నది…అది లా అండ్ ఆర్డర్ కన్నా..అంతగా బరువు లేనిది. అలాంటి హోమ్ గార్డ్ గా పని చేసిన ఓ ఉద్యోగికి..అదీ పోలీసు బాస్..ఎస్పీ వీడ్కోలు.. ఆత్మీయంగా నిర్వహించడం విశేషం. ఈ మేరకు విజయనగరం జిల్లా పోలీసు ఆఫీసు కార్యాలయంలో.. ఈ కార్యక్రమం జరిగింది.

ఎస్పీ దీపికా, అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) సత్యనారాయణ, ఆర్మడ్ రిజర్వ్ అడ్మిన్ చిరంజీవి ఆద్వర్యంలో… హోమ్ గార్డ్ కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జరిగింది.సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో ఎంతో క్రమ శిక్షణతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన హెూంగార్డు భోగి జానకేశ్వరరావుని జిల్లా పోలీసుశాఖ తరపున జరిగింది.

ఈ మేరకు  విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో, ఘనంగా “ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ “ఆత్మీయ వీడ్కోలు” కార్యక్రమంకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక ముఖ్య అతిధిగా హాజరై, మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసిన హెూంగార్డు భోగి జానకేశ్వరరావు పోలీసుశాఖకు సుదీర్ఘకాలం సేవలందించి, సమర్ధవంతంగా విధులు నిర్వహించి, అందరి మన్ననలు పొందారన్నారు.

ఉద్యోగ విరమణ తరువాత వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, సంపూర్ణ ఆరోగ్యంతో, శేష జీవితం ఆనందంగా సాగిపోవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన హెూంగార్డు భోగి జానకేశ్వరరావుని పోలీసుశాఖ తరపున ఎస్పీ ఎం.దీపిక సాలువ, పూలమాలలు, జ్ఞాపికతో సత్కరించి, ఘనంగా “ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, ఆర్ఐ చిరంజీవిరావు, ఆర్ఎస్ఐ కేశవరావు, హెూంగార్డు హెచ్సి రాజు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కేదార్ నాథ్ యాత్రీకుల సంక్షేమం కోసం చర్యలు

Satyam NEWS

డిఫరెంట్ లవ్ స్టోరీస్ తో “లాట్స్ ఆఫ్ లవ్” నేడే విడుదల

Satyam NEWS

డాక్టర్ రెడ్డీస్ నుంచి రష్యా వ్యాక్సిన్ వచ్చేస్తోంది

Satyam NEWS

Leave a Comment