28.7 C
Hyderabad
May 5, 2024 09: 01 AM
Slider ఖమ్మం

బతుకమ్మ చీరల పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ..

#puvvada

ప్రతి సంవత్సరం బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు సీఎం కేసీఆర్ ఒక అన్న లాగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్ లోని 27వ డివిజన్ ప్రకాష్ నగర్ సెయింట్ జోసెఫ్ స్కూల్, 22వ డివిజన్ చర్చ్ కాంపౌండ్ కమ్యూనిటీ హాల్ చీరలను మహిళలకు మంత్రి పువ్వాడ పంపిణి చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 4.27లక్షల చీరలను అన్ని మండల, గ్రామాల్లో ఎర్పాటు చేసిన కేంద్రంలో పంపిణి చేస్తున్నారని, ఖమ్మం జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో మహిళలకు బతుకమ్మ చీరలను మంత్రి పువ్వడం లాంఛనంగా పంపిణీ కార్యక్రమాన్ని పంపిణి చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాల పండుగలకు తోఫాలతో పాటు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి రాష్ట్రం అభివృధ్ది, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో ప్రగతి సాదిస్తు ముందుకు సాగుతోందని తెలిపారు.250 డిజైన్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1.02 కోట్ల చీరలు రూ.354 కోట్లతో చేనేత కార్మికులకు పని కల్పిస్తూ ఆయా సంఘాల ఆధ్వర్యంలో చీరల తయారీ చేసి పంపిణి చేస్తున్నారని అన్నారు. జరీతో పాటు వివిధ రంగుల కాంబినేషన్‌తో 250 డిజైన్లలో ఆకర్షణీయంగా చీరలను తయారు చేయించారని 2017 నుంచి 2022 వరకు 5.81 కోట్ల చీరలను ఆడబిడ్డలకు అందించారన్నారు.

విశ్వవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ వేడుకలు ప్రతీకగా నిలిచిందని, ఒకప్పుడు బతుకమ్మ అడాలంటే ఏదో తప్పు చేసినట్టు చేసే వారని కానీ నేడు జాగృతి అధ్యక్షురాలు కవిత నేతృత్వంలో ఇతర దేశాల్లో కూడా సంప్రదాయంగా బతుకమ్మ ఆడి ప్రతిష్టను పెంచారని అన్నారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగకు ఆడబిడ్డలందరూ కొత్త చీరలు ధరించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ గడచిన 10 ఏళ్లుగా బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని కొనసాగిస్తున్నారని అవన్నీ నేనే స్వయంగా ప్రతి ఏడాది పంపిణి చేయడం అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళీ, గజ్జెల లక్ష్మీ, సరస్వతి రవి నాయక్, పగడాల శ్రీవిద్య నాగరాజు, శీలంశెట్టి రమా వీరభద్రం, గోళ్ళ చంద్రకళ, దొడ్డా నగేష్, విద్యాచందన, తహశీల్దార్ స్వామి, మున్సిపల్ అధికారులు, నాయకులు ఉన్నారు.

Related posts

కరోనా ఎఫెక్ట్: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం

Satyam NEWS

బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు

Murali Krishna

అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకం

Bhavani

Leave a Comment