37.2 C
Hyderabad
May 1, 2024 12: 08 PM
Slider ఖమ్మం

అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకం

#Bhadradri Kothagudem

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం మరియు ఆదర్శమని ఆయన ఆశయాలకు అనుగుణంగా సూచించిన మార్గంలో పయనించి నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. రుద్రంపూర్ లోని గౌతమ్ పుర్ కమ్యూనిటీ హాలు లో అంబేద్కర్ జయంతి సందర్భంగ జరిగిన న్యాయ అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి ముఖ్య అతిథిగ పాల్గొని ప్రసంగించారు.

అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం లో ఆర్టికల్ 39( డి )ప్రకారం సమాన పనికి సమాన వేతనం లింగ బేధం లేకుండా స్త్రీ, పురుషులకు సమానంగా ఇవ్వాలని తెలియజేస్తుందని అని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం అనేది ప్రతి కార్మికుడి కనీస హక్కు అని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల ప్రయోజనాలను మరియు వారి శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన బాధ్యత సంబంధిత యాజమాన్యo కు ఉంటుందని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఐడి కార్డులు, కనీస వేతనం, భద్రత ప్రాధాన్యత, ఈఎస్ఐ కల్పించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎన్.శంకర్ రావు, అసిస్టెంట్ కమిషనర్ సీఎం.పి.ఎఫ్ ఎం. కనకమ్మ, హైకోర్టు న్యాయవాది పి.వీ.ఎస్ శాస్త్రి, సింగరేణి ట్రాన్స్ పోర్ట్ జనరల్ మేనేజర్ దామోదర్ రావు, చీప్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.పురుషోత్తం రావు, డిప్యూటీ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, న్యాయవాది లక్కినేని సత్యనారాయణ, రాజమల్లు, కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు రాసూరి శంకర్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ జి. నాగ స్రవంతి, జ్యోతి విశ్వకర్మ,ఆర్తి మక్కడ్ అనుదీప్ సింగరేణి కాంట్రాక్టు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మున్సిపాలిటీలో 5 రూపాయల భోజన పథకం అమలు చేయాలి

Satyam NEWS

దళిత బంధు రావాలంటే కొల్లాపూర్ ఎమ్మెల్యే రాజీనామా చేయాలి

Satyam NEWS

పాజిటీవ్ కేసులు పెరిగినా ప్రజలు భయపడవద్దు

Satyam NEWS

Leave a Comment