29.7 C
Hyderabad
May 6, 2024 06: 47 AM
Slider నిజామాబాద్

కామారెడ్డి పట్టణాభివృద్ధికి 20 కోట్ల నిధులు మంజూరు

#gampagovardhan

కామారెడ్డి పట్టణ అభివృద్ధికి టుఫీడ్ కో నిధుల ద్వారా 20 కోట్ల రూపాయలను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేసారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేపట్టబోయే పనుల వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రం అయిన తర్వాత క్రీడాకారుల సౌకర్యం కోసం ఇండోర్ స్టేడియం నిర్మాణం, క్రీడల కోసం 8 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.

కొత్త చెరువు వద్ద గల వైకుంఠ దామం మిగులు పనుల కోసం 2 కోట్లు, పాత రాజంపేట రైల్వే గేటు నుంచి శుభం ఫంక్షన్ హాల్ వరకు మిగిలిపోయిన ఆరు లైన్ల రోడ్డు నిర్మాణానికి ఒక కోటి రూపాయలు, జీవదాన్ ఆస్పత్రి చౌరస్తా నుంచి సాయిబాబా ఆలయం మీదుగా తిరుమల అపార్టుమెంటు వరకు బిటి రోడ్డు నిర్మాణం కొరకు కోటి రూపాయలు, పట్టణంలో వివిధ వార్డులో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం కోసం 1.08 కోట్లు, నర్సన్నపల్లి స్వాగత తోరణం సుందరికరణ కోసం ఒక కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు.

అలాగే ఇందిరాగాంధీ స్టేడియం కాంపౌండ్ వాల్ కోసం 60 లక్షలు, రామారెడ్డి రోడ్ ఆటో స్టాండ్ నుంచి వయా సుభాష్ రోడ్డు బిటి రోడ్డు కోసం 52.90 లక్షలు, 47 వ వార్డులో బిటి రోడ్డు కోసం 50 లక్షలు, దేవివిహార్ నుంచి లింగాపూర్ వరకు సెంట్రల్ లైటింగ్ కోసం 50 లక్షలు, 14 వ వర్ఫులో సిసి రోడ్లు, కల్వర్టుల నిర్మాణం కోసం 45 లక్షలు, లింగాపూర్ స్వాగత తోరణం కోసం 45 లక్షలు, డిఆర్సీ సెంటర్ కాంపౌండ్ వాల్ కోసం 42 లక్షలు, డిఆర్సీ సెంటర్ వెనక భాగం నుంచి పెద్ద చెరువు వరకు బిటి రోడ్డు కోసం 43 లక్షలు, సరంపల్లిలో బిటి రోడ్లకు 40 లక్షలు, రాజా ఆయిల్ మిల్ నుంచి పాంచ్ రాస్తా వరకు బిటి రోడ్డు కోసం 35 లక్షలు, భుపుత్రమ్మ కల్యాణ మండపం ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ వద్ద సిసి రోడ్ల కోసం 32 లక్షలు, 14 వ వార్డులో సిసి డ్రైన్స్, సిసి కల్వర్టుల కోసం 30 లక్షలు, లింగాపూర్ స్వాగత తోరణం కోసం 30 లక్షలు, చాట్ల బీడీ కంపెనీ వద్ద నీరు నిల్వకుండా డ్రైనేజీ కోసం 30 లక్షలు, స్టేడియం నుంచి టేక్రియాల్ బైపాస్ వరకు డివైడర్లలో పూల మొక్కలు నాటేందుకు 20 లక్షలు, 47 వ వార్డులో బిటి రోడ్డు కోసం 15 లక్షలు, పెద్ద చెరువు వద్ద కోటి లింగాల ఆలయ వరకు సిసి రోడ్డు కోసం 12 లక్షలు, పాత రాజంపేట బిటి రోడ్డు కోసం 10.35 లక్షలు, 10 వ వార్డు నల్లపోచమ్మ టెంపుల్ వద్ద సిసి రోడ్ల కోసం 10 లక్షలు, కొత్త బస్టాండ్ నుంచి పార్శీరాములు కల్యాణ మండపం వరకు బిటి రోడ్డు నిర్మాణం కోసం 10 లక్షలు, చర్చ్ రోడ్డు వద్ద బిటి రోడ్డు కోసం 7 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు.

కామారెడ్డి సుందరీకరణ కోసం నాలుగు, ఆరు లైన్ల రోడ్ల నిర్మాణంతో పాటు సెంట్రల్ డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో 8 జంక్షన్లకు నిధులు మంజూరు చేసుకోవడం జరిగిందని, నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ చర్చ్ చౌరస్తా వద్ద రౌండ్ జంక్షన్లు, రైల్వే బ్రిడ్జి వద్ద అంబెడ్కర్ విగ్రహం, ఇందిరాచౌక్, పొట్టి శ్రీరాములు విగ్రహం, సుభాష్ విగ్రహం, జయప్రకాష్ నారాయణ్ విగ్రహం వద్ద జంక్షన్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు.

ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటే నూతనంగా ఏర్పాటు చేస్తామన్నారు. 2016 దసరా రోజున ఏర్పడిన కామారెడ్డి కొత్త జిల్లాను 2023 దసరా వరకు 7 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, మాచారెడ్డి జడ్పీటీసీ మీనుకూరి రాంరెడ్డి, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, బల్వంత్ రావు తదితరులు పాల్గొన్నారు

Related posts

ఘనంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవం

Satyam NEWS

అప్పుడు గణతంత్రం ఇప్పుడు రణతంత్రం!

Satyam NEWS

కరోనా నిర్మూలనలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయం

Satyam NEWS

Leave a Comment