36.2 C
Hyderabad
May 14, 2024 16: 38 PM
Slider నిజామాబాద్

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి కాంగ్రెస్ బిసి డిక్లరేషన్

#revanth reddy

కామారెడ్డి జిల్లా కేంద్రానికి నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రానున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్డీఓ కార్యాలయంలో ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందించనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి తరపున మాజీ మంత్రి షబ్బీర్ అలీ మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేయగా నేడు మూడు సెట్లు నామినేషన్స్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ అనంతరం ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బిసి డిక్లరేషన్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసారు.

షెడ్యూల్ ఇలా

రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటల లోపు కామారెడ్డికి హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. ఎస్పీ కార్యాలయం వద్ద హెలిప్యాడ్ నుంచి నేరుగా షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లి ముఖ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 1:30 లకు బైక్ ర్యాలీ మధ్య ఆర్డీఓ కార్యాలయం వరకు చేరుకుని నామినేషన్ దాఖలు చేస్తారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి అదే బైక్ ర్యాలీతో స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు వెళ్లనున్నారు. బహిరంగ సభకు బిసి డిక్లరేషన్ సభాగా నామకరణం చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బిసి డిక్లరేషన్ సభలో పాల్గొననున్నారు.

రేవంత్ రెడ్డి స్పీచ్ పై ఉత్కంఠ

కామారెడ్డి నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ పోటీ నుంచి తప్పుకోవడం, అనూహ్యంగా రేవంత్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో ఇప్పటిదాకా అనేక అనుమానాలు అలాగే ఉండిపోయాయి. సీఎం కేసీఆర్ పై పోటీకి భయపడే షబ్బీర్ అలీ పోటీ నుంచి తిప్పుకున్నారన్న ప్రచారం సాగింది. అయితే సీఎంను ఢీకొనేందుకే రేవంత్ రెడ్డిని పార్టీ అధిష్టానం రంగంలోకి దింపిందన్న వార్తలు వచ్చాయి. అయితే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి గెలిస్తే ఇక్కడునుంచే పాలన సాగిస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా వాటిపై రేవంత్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు నిన్నటి సీఎం కేసీఆర్ సభలో కామారెడ్డికి ప్రత్యేకంగా హామీలు ఏమి ఇవ్వకపోవడంపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది తెలియాలి. మరోవైపు ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో రెడ్ హ్యండెడ్ గా దొరికిన దొంగ తనపై పోటీ చేస్తాడట అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందిస్తారా దాటవేస్తారా వేచి చూడాలి. మరోవైపు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి ఐక్య వేదిక ప్రకటించినా సీఎం కేసీఆర్ దానిపై స్పందించలేదు. రేవంత్ రెడ్డి కామారెడ్డికి వచ్చినప్పుడు ప్రకటించాలని రెడ్డి సంఘం నాయకులు సూచించారు. రెడ్డి కార్పొరేషన్, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందో దానిపై పిసిసి హోదాలో రేవంత్ రెడ్డి స్పందిస్తారా అనేది చూడాలి.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి నిమ్మగడ్డ కితాబు

Satyam NEWS

డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కు ఘన స్వాగతం…భారీ కాన్వాయ్ తో

Satyam NEWS

గృహ సారథులను, కన్వీనర్లను రద్దు చేయాలి

Satyam NEWS

Leave a Comment