28.7 C
Hyderabad
May 6, 2024 10: 47 AM
Slider పశ్చిమగోదావరి

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పడకల పెంపునకు చర్యలు

#EluruHospital

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు 500 వందల  వరకు పెంచేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కార్తికేయ తెలిపారు. శనివారం హాస్పటల్ లో హెల్ప్ డెస్క్, ట్రాయాజింగ్ సెంటర్, ఆక్సిజన్ ప్లాంట్ ఆయన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఆస్పత్రిలో ఆక్సిజన్ సమస్య ఏర్పడిందని దానిని 20 నిమిషాల్లోనే  సరి చేశామని ఆయన తెలిపారు.

ఆక్సిజన్ సరఫరాకు ఆక్సిజన్ జనరేటర్ ను ఆస్పత్రిలోని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. దీని ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని దానిని వేరే ప్రాంతాలకూ సరఫరా చేయడంగాని, లేదా ఇక్కడే  వినియోగించు కోవచ్చు అన్నారు.  దీని ద్వారా నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవచ్చని ఆయన అన్నారు.

15 క్యూబిక్ లీటర్ సామర్ధ్యం గల ఆక్సిజన్  ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు దాత రాజు  ముందుకు వచ్చారని త్వరలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. 10 k.l  వరకూ సామర్ధ్యంగల స్టోరేజ్ ప్లాంట్ ఏర్పటు చేస్తామన్నారు.

దీని ద్వారా ఆక్సిజన్  సమస్య ఉండదన్నారు. ఆర్ అండ్ బి, ఎన్ హెచ్ ఎ ఐ వారు ఆస్పత్రిలో జర్మన్ టెక్నాలజీతో 100 నుండి 150  బెడ్ ల కు ఆక్సిజన్ సరఫరా చేసే విధంగా ప్రణాళిక రూపొందిచారని, అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించామని ఆయన తెలిపారు. ఇది మంజూరీ అయినట్లయితే ఆసుపత్రి లో బెడ్లు సమస్య ఉండదని ఆయన అన్నారు.

ప్రతిరోజు ఆస్పత్రిలో 60 నుంచి 70 పేషెంట్లు జాయిన్ అవుతున్నారు అని 40 నుంచి 50 పేషెంట్లు డిశ్చార్జ్ అవుతున్నారని ఆయన తెలిపారు. ఏలూరు లో సిఆర్ఆర్ కళాశాలలో  కోవిడ్  కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో  24 గంటలు డాక్టర్లను, ఆక్సిజన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కోవిడ్ కేర్ సెంటర్లను ఎక్కువ పేషెంట్లు ఉంచే విధంగా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.

ప్రైవేట్  అంబులెన్సులు పేషెంట్లు వద్ద నుండి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు  ఫిర్యాదులు అందాయని అటువంటి వారిపై చర్యలు తీసుకోవలసిందిగా  ఆర్ టి ఓ, ఆర్డీవో  డి.ఎస్.పి లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈ సమయంలో ఎవరైనా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లైతే  వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమయంలో ఎవరైనా మానవతా దృక్పథంతో పని చేయాలే తప్ప ధనార్జనే ధ్యేయంగా పని చేయకూడదని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి ) శ్రీమాన్ శుక్ల , ట్రైనీ కలెక్టర్  టి.రాహుల్ కుమార్ రెడ్డి,   డి సి హెచ్ ఎస్ ఏ వి ఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతు భరోసా కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలి

Bhavani

త్వరలో జియో ల్యాప్‌టాప్‌

Murali Krishna

నాటితరం ప్రఖ్యాత నటుడు కాంతారావుకు నివాళి

Bhavani

Leave a Comment