27.7 C
Hyderabad
May 7, 2024 10: 01 AM
Slider అనంతపురం

రైతు భరోసా కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలి

#Farmer assurance centers

వ్యవసాయ మరియు అనుబంధ శాఖాధికారులతో వివిధ అంశాలపై జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో తొలుత డివిజన్ వారీగా జిల్లాల్లో నిర్మించిన కొత్త రైతు భరోసా కేంద్రాల భవనాల వివరాలు సంబంధిత శాఖ అధికారులతో అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను ఆయా వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకుని వాటిని వాడకంలోకి తీసుకురావాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 248 భవనాలు పూర్తి అయ్యాయని అందులో 162 స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. మిగిలిన 86 లను కూడా వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకోవడం కొరకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ పంట నమోదు సంబంధించిఅప్లికేషన్ లు వస్తున్నాయని, అందువల్ల వాటిపై డివిజన్ మండల మరియు రైతు భరోసా కేంద్రం వరకు వ్యవసాయ ,ఉద్యానవన, సెర్రికల్చర్ మరియు రెవెన్యూ శాఖ అధికారులకు శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. జిల్లాల వర్షాభావ పరిస్థితుల్లో నెలకొనే ఉన్నందున ప్రతినిమాయ విత్తనాలు సంబంధించి వివరాలను వ్యవసాయ కమిషనర్ కార్యాలయం పంపించాలని ఆదేశించారు.

జిల్లా పౌర సరఫరాల శాఖ ద్వారా కనీస మద్దతు ధరతో జొన్నలు రాగులు మరియు కందులు కొనుగోలు చేయడం జరుగుతున్నందున చిరుధాన్యాలు సంబంధించి విస్తీర్ణం పెంచే విధంగా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా కల్తీ విత్తనాలు గాని ఎరువులు గాని పురుగులు మందులు రాకుండా వ్యవసాయ అధికారులు పటిష్ట చర్యలతో ప్రత్యేకంగా ఉంచి డీలర్ల షాపులు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని, అలాగే శాంపుల్ తీసి పంపించాలని ఆదేశించారు.

ప్రతి రైతు భరోసా కేంద్రంలో అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌరదారు రైతులను గుర్తించి వారికి కౌలుదారు కార్డులు ఇప్పించాలని తెలిపారు. ఇప్పటివరకు మన జిల్లాలో 6,514 సీసీఆర్సీ కార్డులు లక్ష్యం కాగా 5212 కౌలు దారుడు గుర్తింపు కార్డును పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

అదేవిధంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, సూక్ష్మనీటిపారుదల అధికారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ,మత్స్యశాఖ ,పట్టు పరిశ్రమ శాఖ ,మార్కెటింగ్ జిల్లా కో-ఆపరేటివ్, డైరీ మరియు పౌరసరఫరాల శాఖకు సంబంధించిన అధికారులతో ఆయా శాఖల ద్వారా చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ ,జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రఘునాథ్ ,జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. సుబ్రహ్మణ్యం ,సూక్ష్మ నీటిపారుదల శాఖ అధికారి ఫిరోజ్ ఖాన్ వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మిట్ట మధ్యాహ్నం.. నడి రోడ్ పై డ్రంక్ అండ్ డ్రైవ్…!

Satyam NEWS

కరోనా కేసులు పెరగడంతో స్కూళ్లు బంద్ చేసిన హిమాచల్

Satyam NEWS

గుజరాత్ లోనూ బ్యాటింగ్ మొదలెట్టిన బీజేపీ

Satyam NEWS

Leave a Comment