33.2 C
Hyderabad
May 15, 2024 12: 47 PM
Slider జాతీయం

దేశంలో గోధుమల కొరతకు కారణం బిజెపి అసంబద్ధ నిర్ణయమే

#akhileshyadav

బీజేపీ ప్రభుత్వం పేదల వ్యతిరేకి అని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKY)లో గోధుమ కోటాను రద్దు చేయాలని నిర్ణయించడానికి కారణం ఇదేనని ఆయన అన్నారు. జూన్ నెల నుంచి పేదలకు గోధుమలకు బదులు బియ్యం పంపిణీ ప్రకటించారు. ఇప్పటి వరకు మూడు కిలోల గోధుమలు, రెండు కిలోల బియ్యం పంపిణీ చేసేవారు. అయితే ఇప్పుడు మొత్తం బియ్యమే ఇవ్వబోతున్నారు.

ఎన్నికలు ముగిసిన తర్వాత రైతుల నుంచి సమ్మాన్‌ నిధి సొమ్ము వాపసు చేయాలని నోటీసులు జారీ చేస్తున్నారని అఖిలేష్ అన్నారు. గోధుమల సేకరణలో రైతుల ప్రయోజనాల కంటే పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకే ఈసారి బీజేపీ ప్రాధాన్యతనిస్తోందన్నారు. ప్రభుత్వం గోధుమల సేకరణకు బదులుగా ఐదు పెద్ద కంపెనీలకు గోధుమలను విక్రయించిందని ఆయన అన్నారు.

అందుకే దేశంలో గోధుమలకు కొరత ఏర్పడిందని అఖిలేష్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో 60 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమ సేకరణ లక్ష్యం కాగా 2.35 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలను మాత్రమే సేకరించారు. దీంతో మార్కెట్‌లో గోధమ పిండి ధర ఎక్కువగా ఉంటుంది. పెద్ద పారిశ్రామికవేత్తలు వారి కంపెనీల లాభాలు పెరుగుతాయి. రైతులకు మేలు చేయడం బీజేపీ ఉద్దేశం కాదన్నారు. గోధుమలకు లాభసాటి ధర ఇవ్వాలనుకుంటే, కనీస మద్దతు ధర (MSP) క్వింటాల్‌కు కనీసం రూ. 2500 ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

అరంగేట్రంతోనే అదరగొట్టిన కత్తిలాంటి కొత్త కుర్రాడు అసిఫ్ ఖాన్

Satyam NEWS

బిజెపి లోకి సీనియర్ హీరోయిన్ జయసుధ.?

Bhavani

శ్రామికుల జ‌య‌భేరి

Satyam NEWS

Leave a Comment