38.2 C
Hyderabad
May 3, 2024 20: 30 PM
Slider కవి ప్రపంచం

శ్రామికుల జ‌య‌భేరి

#TirunagariSrinivasNew

శ్రామికుల జ‌య‌భేరి
మ్రోగేది నేడే
కార్మికులు ఏక‌మై
క‌దిలేది నేడే
విశ్వ‌కార్మిక దినోత్స‌వం  
జ‌రిగేది నేడే
శ్ర‌మ‌శ‌క్తి ఐక్య‌త‌ను
చాటేది మేడే
ఇంక్విలాబ్ జిందాబాద్
అని ముక్తకంఠ‌మై ప‌ల‌కాలి
కార్మికులు ఐక్య‌మై
క‌లిసి న‌డ‌వాలి
అక్ర‌మాన్నెదిరించు మేడే
అన్యాయంపై ర‌ణ‌భేరి మేడే
ఏ దేశ‌మందున్నా
ఏ జాతి వారైనా
కార్మికుల శ్రామికుల
క‌థ‌లొక్కటేన‌ని
క‌లిసి న‌డ‌వండ‌ని
క‌ల‌త విడవండని
సందేశ‌మిచ్చునీ
శ్రామికుల మేడే
అభ్యుద‌యప‌థాన్ని చూపే
దారిదీపం మేడే
న‌వ‌త వైపుకు
సమ‌స్త శ్రామిక లోకాన్ని
న‌డిపించు మార్గమే మేడే
(నేడు  మేడే…)

తిరున‌గ‌రి శ్రీ‌నివాస్
                         

Related posts

దుర్గామాత ఆశీస్సులు తీసుకున్న బిజెపి నాయకులు

Satyam NEWS

కేసీఆర్ వి పిట్టల దొర కథలు

Bhavani

జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు

Satyam NEWS

Leave a Comment