29.7 C
Hyderabad
April 29, 2024 09: 35 AM
Slider సంపాదకీయం

మళ్లీ రాహుల్ గాంధీనే బాధ్యత మోయక తప్పదా?

#soniagandhi

దేశంలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకువచ్చే బాధ్యతను రాహుల్ గాంధీ చేపట్టక తప్పదనే వాదన వినిపిస్తున్నది. పార్టీలో నూతన ఉత్తేజం నింపేందుకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ సీనియర్ నేతల బృందంతో చర్చల్లో మునిగిపోయి ఉన్నారు.

ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు, దేశం ఎదుర్కొంటున్న సమస్యలు కూలంకషంగా చర్చిస్తున్నారు. భవిష్యత్తు దిశానిర్దేశం చేయడంతో పాటు పరిష్కారాలు అన్వేషిస్తున్నారు. ఇంతలా అక్కడ చర్చలు జరుగుతున్నా కూడా తమ రాజకీయ జీవితంపై కాంగ్రెస్ నేతలకు ఆందోళన తగ్గుతున్నట్లు లేదు.

కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇంకా ఢిల్లీకి రాకముందే పార్టీలో తిరుగుబాట్లు మొదలయ్యాయి. పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఉదయ్‌పూర్‌లో ఉన్న పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ఒకరు వేచి ఉండండి అని చెప్పినా కూడా ఆయన ఆగలేదు. జ్వరానికి మందు అవసరమైన చోట కడుపునొప్పి మాత్రలు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానిస్తూ పార్టీని వీడిపోతున్నారు.

అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో వర్గ పోరాటం

కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఈ అంశంపైనే విస్త్రత చర్చలు కూడా జరుగుతున్నాయి. స్వేచ్ఛ ఎక్కువగా ఉండటం వల్ల ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ పార్టీకి వెన్ను పోట్లు పొడుస్తున్నారు. బహుశ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాత పార్టీలో ఇంత స్వేచ్ఛ ఉండకపోవచ్చు.

కాంగ్రెస్ పార్టీ ముందున్న అతిపెద్ద సవాలు సంస్థాగత సంస్కరణలు. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరును అంతం చేయడం, ఐక్య రాజకీయ ప్రచారాన్ని నిర్వహించడం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఈ కేస్ స్టడీ తో రాబోయే రోజుల్లో పార్టీలో మార్పులు చేసుకోవాలని చూస్తున్నారు.

ఇది జరిగితేనే 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ, ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు రాగలవు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నవ్ సంకల్ప్ చింతన్ శివిర్‌లో చర్చలు జోరుగా సాగుతుండగా, పుకార్లు కూడా వేగంగానే వ్యాపిస్తున్నాయి.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మే 15 ఆదివారం CWC సమావేశానికి పిలుపునిచ్చారు. ఇందులో భవిష్యత్తు పరిస్థితి, దిశానిర్దేశంపై కీలక చర్చ జరగనుంది. దీని తర్వాత రాహుల్ గాంధీ కూడా పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తారని భావిస్తున్నారు.

సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన నాయకుడని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పార్టీని ఏకతాటిపైకి నెట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను బలోపేతం చేసే బాధ్యతను ఆయన కొనసాగించాల్సి వస్తుంది. ఈ ఆలోచనా శిబిరం తర్వాత మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధ్యత మరింత పెరుగుతుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. కొత్త అధ్యక్షుడి గురించి అడిగినప్పుడు, ఆగస్టు మొదటి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలోగా ప్రతిపాదిత ఎన్నికలలో నిర్ణయించవచ్చని ఒక సీనియర్ నేత చెప్పారు.

Related posts

ట్రయల్ కోర్టు తర్వాత సుప్రీందే తుది నిర్ణయం కావాలి

Satyam NEWS

కరోనా పేరుతో దోచుకుంటున్న ప్రయివేట్ ఆసుపత్రులు

Satyam NEWS

జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment