39.2 C
Hyderabad
May 3, 2024 12: 07 PM
Slider మహబూబ్ నగర్

షాద్ నగర్ లో బీజేపీ సీనియర్ నాయకుల సమ్మేళనం

#bjp

షాద్ నగర్ లో  డాక్టర్ టంగుటూరి విజయ్ కుమార్ అధ్యక్షతన  బిజెపి సీనియర్ నాయకుల సమ్మేళనం నిర్వహించారు. మంగళవారం షాదనగర్ పట్టణంలో బీజేపీ కార్యాలయంలో సీనియర్ నాయకుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. బిజెపి సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు  కందురీ కృష్ణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ   శ్యామ్ ప్రకాశ్ ముఖర్జీ నెహ్రు కేబినెట్ మంత్రి ఉండి నెహ్రు విధానాలు నచ్చక మంత్రి పదవి కి రాజీనామా చేసి జనసంఘ్ ఏర్పాటు చేశారని తెలిపారు. కాశ్మీర్ సమస్య ను పరిష్కారం చేసింది బీజేపీ ప్రభుత్వం అని గుర్తు చేశారు. ఎంతోమంది బలిదానాలు చేయడం వల్లనే దేశానికి స్వాతంత్రం వచ్చింది అని అన్నారు.

మన ప్రధాని నరేంద్రమోడీ ని  మళ్ళీ గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం సీనియర్ నాయకుడు రాంరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. బీజేపీ సీనియర్ నేత, వి హెచ్ పి రాష్ట్ర కోశాధికారి బండారు రమేష్ గుప్తా మాట్లాడుతూ  దేశంలో నరేంద్రమోదీ ని ఓడించడానికి ఎన్నో కుట్రలు చేస్తున్నారని మనమంతా ఐక్యంగా వుండి తిప్పికొట్టాలని, యుద్ధంలో సైనికుడు  ఎలా పోరాటం చేసి విజయం సాధిస్తారో అదే విదంగా అలుపెరుగని పోరాటం చేయాలనీ పిలుపు నిచ్చారు.కొప్పుల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పదవి ఆశించకుండా పని చేసే కార్యకర్తలే బీజేపీ కి బలం అని తెలిపారు.

అభ్యర్థులు ఎంతమంది ఉన్న పార్టీ నిర్ణయించిన అభ్యర్థి ని గెలిపించాల్సిన  బాధ్యత అందరి పైన ఉన్నదని అని అన్నారు. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ కలిసి పని చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి,అందె బాబయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్,కమ్మరి భూపాల్ చారి,కక్కునూరి వెంకటేష్ గుప్తా,A. P. మిథున్ రెడ్డి, కొప్పుల రవీందర్ రెడ్డి,పట్లోలా వెంకటేశ్వర రెడ్డి, అమడపురం నర్సింహ,కందురీ మనోహర్ రెడ్రి,కల్వ యాదగిరి,లక్ష్మయ్య గౌడ్,దొడల లక్ష్మయ్య,నరేందర్ రెడ్డి,కావలి యాదయ్య,సున్నల అంజయ్య,పటేల్ ప్రభులింగం,పటేల్ శ్రీశైలం,శేషయ్య గుప్తా,పిట్టల పాపయ్య,ర్యాకల నారాయణ, సిరిపురం వెంకటరమణ,నారం రాంరెడ్డి, మధుసూదన్ గౌడ్,మోతే శ్రీనివాస్,బెజ్జు ప్రభు,ప్రతాప్ రెడ్డి,సురేందర్ గౌడ్,బోయ శంకర్,రాజు,ఎంకొల్ల వెంకటేష్,మొగలి నర్సింలు,సారా  అంజయ్య,శేఖర్,దొడల వెంకటేష్, డిస్కో శ్రీనివాస్,రఘు గౌడ్,కుమార్ గుప్తా,దివిటి వెంకటయ్య, రఘు రాం,పల్లె అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మెదక్ ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు

Bhavani

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అరెస్టు వారంట్

Satyam NEWS

గుజరాత్ పై గురి: ముడు పార్టీలు నువ్వా నేనా

Bhavani

Leave a Comment