31.7 C
Hyderabad
May 7, 2024 02: 06 AM
Slider హైదరాబాద్

60వ రోజుకు చేరిన బిజెపి గడపగడప ప్రజా యాత్ర

#prajayatra

మంగళవారంతో బిజెపి గడప గడప ప్రజా యాత్ర 60 రోజులకు చేరింది.మాదాపూర్ డివిజన్, చంద్రనాయక్ తాండా , దోభీ ఘాట్ లలో మంగళవారం కొనసాగిన గడప గడపకు బీజేపీ, రవన్న ప్రజాయాత్ర విజయవంతంగా 60 రోజులకు చేరింది.
ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చారని దుయ్యబట్టారు.

రానున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో అధికారం బిజెపి దేనిని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి తోడ్పడతామని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.అందరికీ ఆదర్శంగా నిలుస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. 60 వ రోజు గడప గడపకు బీజేపీ, ప్రజల గోస – రవన్న భరోసా ప్రజాయాత్ర మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్రనాయాక్ తాండా , దోభి ఘాట్ లలో ఇంటి ఇంటికి కరపత్రాలను పంచుతూ, బి.ఆర్.ఎస్ అవినీతిని ప్రజలకు తెలియజేస్తూ , కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ పర్యటించామని మన నియోజవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం లో చేసిన అభివృద్దే గానీ , ఏళ్ళు గడుస్తున్నా రోడ్లు లేవు ,సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని సరిపడా శానిటైజేషన్ సిబ్బంది ఎవ్వరికీ కొత్త రేషన్ కార్డులు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు ,దళిత బంధు కూడా వాళ్ళ అనునుయులకే ఇచ్చారని ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని కబ్జాలకు , వసూళ్లకు కేరాఫ్ అడ్రస్ గా మార్చారన్నారని దుమ్మెత్తి పోశారు. ప్రతి డివిజన్ లో వీళ్ళ కబ్జాల దందా నడుస్తూనే ఉందని , అన్ని బయటపెడతామని హెచ్చరించారు .

చెప్పిన హామీ ఒక్కటి కూడా సక్కగా నెరవేర్చాలేని ఈ కేసిఆర్ , బి.ఆర్.ఎస్ నాయకులు ఇప్పుడు ఎన్నికలలో బిసిలను మోసం చేసేందుకు కొత్త పథకం బిసి బంధు పెట్టారని దానికి కూడా సవాలక్ష నిభందనలు పెట్టారని , మీ మాయమాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు ,మిమ్మలని ఇంటికీ పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు , కేంద్రం లో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో సంస్కరణలతో , ఎన్నో సంక్షేమ పథకాలతో , విప్లాత్మకమైన నిర్ణయాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూ, ప్రపంచ దేశాల లో శక్తి వంతమైన దేశంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు ,

మనం గెలిచిన తదనంతరం పాదయాత్రలో మా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను ఒక ప్రణాళికా బద్దంగా పరిష్కరించే దిశా చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, వివిధ మోర్చ ల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నేర సమీక్షా సమావేశం.. గతేడాది కన్న భిన్నంగా నిర్వహణ..!

Satyam NEWS

మంత్రి నారాయ‌ణ స్వామికి జగన్ షాక్‌!

Satyam NEWS

సేవ చేస్తే ఓటు వేస్తారు… తప్ప పోస్టర్ చూసి వేయరు

Satyam NEWS

Leave a Comment