29.7 C
Hyderabad
May 4, 2024 04: 56 AM
Slider హైదరాబాద్

గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వ ఆంక్షలపై వెల్లువెత్తిన నిరసనలు

#BJPAmberpet

గణేష్ నవరాత్రి ఉత్సవాల పై టిఆర్ఎస్ ప్రభుత్వం విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సంఘ్ పరివార్ సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు మల్లికార్జున్ నగర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు.

చుక్క జగన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన భాగ్యనగర్ సెంట్రల్ కమిటీ సభ్యులు N. బుచ్చిరెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మజ్లిస్ పార్టీ డైరెక్షన్ లో  హిందువుల పండుగలు పై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు.

కాబట్టి హిందువులందరూ సంఘటితంగా ఇలాంటి ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఉత్సవ సమితి అసెంబ్లీ కన్వీనర్ ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకొని సామాజిక దూరాన్ని పాటిస్తూ పండుగలు జరుపుకుంటామని తెలియజేసినా ఆంక్షలు విధించడం విచారకరమని అన్నారు.

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణ గౌడ్ మాట్లాడుతూ కెసిఆర్ పాలన నిజాం నియంతృత్వాన్ని తలపిస్తుందని, తుగ్లక్ పాలన అంతం చేయాలని అన్నారు. బాగ్ అంబర్ పేట డివిజన్, భాగ్యనగర్ ఉత్సవ సమితి కన్వీనర్ చుక్క జగన్  మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం హిందువుల పండుగలు వచ్చినప్పుడు కరోనా వ్యాధి భయాన్ని చూపిస్తూ కఠినమైన ఆంక్షలు విధిస్తూ, మజ్లిస్ పార్టీ సూచనలతో ఒక వర్గం వారి ఓట్ల కోసం వారి పండుగ సమయాల్లో చూసిచూడనట్లు వ్యవహరిస్తోందని అన్నారు.

పార్టీలను పక్కనపెట్టి హిందువులందరూ సంఘటితంగా కావాలని, హిందూ వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. 

ఉత్సవ సమితి సభ్యులు N.బుచ్చిరెడ్డి, ఆనంద్ గౌడ్, చుక్క జగన్, కృష్ణ గౌడ్, P. గోవర్ధన్ రెడ్డి, N సాంబ శివ గౌడ్, అచిని  రమేష్, N దత్తు, కోడూరు సురేష్,  M.మధుసూదన్, శివ కుమార్, మల్లారెడ్డి, హరి నాయక్, బాలకృష్ణ గౌడ్, రాజేష్ పాల్గొని టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.

Related posts

నీటి విడుద‌ల‌పై ఉన్న‌త‌స్థాయి స‌మావేశం

Sub Editor

మంచి మాట

Satyam NEWS

వ్యాసాయ విష్ణు రూపాయ..విజ‌య‌న‌గ‌రంలో వ్యాస భ‌గ‌వానుడు….ఎక్క‌డంటే..?

Satyam NEWS

Leave a Comment