29.7 C
Hyderabad
May 6, 2024 04: 15 AM
Slider నెల్లూరు

స్థానిక ఎన్నికల ఫలితాలతో నెల్లూరు బిజెపి సంతృప్తి

#bjpnellore

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన పరిషత్ ఎన్నికలలో ఊహించిన విధంగానే  బిజెపి కి ఓట్లు పోలయ్యాయని బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఎస్.ఎస్.ఆర్.నాయుడు అన్నారు. వెంకటగిరి పట్టణం, తూర్పు వీధిలోని బిజెపి కార్యాలయం లో  మీడియా తో ఆయన మాట్లాడుతూ ZPTC, MPTC ఎన్నికలలో బిజెపి కి ఓట్లు వేసిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

పరిషత్ ఎన్నికల పోలింగ్ సరళి చూస్తే వెంకటగిరి లో బిజెపి కి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్ ఉన్నట్లుగా అర్ధమౌతుందన్నారు. వెంకటగిరి, కలువాయి, సైదాపురం, డక్కిలి, బాలాయపల్లి  మండలాలలో అన్ని ZPTC, MPTC స్థానాలలో బిజెపి పోటీ చేసిందని, బి జె పి కి పోలింగ్ శాతం  ఆశాజనకంగా ఉందన్నారు.

పరిషత్ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో అక్రమాలకు పాల్పడిందని, బిజెపి అభ్యర్థులను బెదిరించి,ఒత్తిడి చేసి పోటీ నుండి విరమింప జేయాలని చూశారని, కానీ దాన్ని తాము అడ్డుకొని రాష్ట్ర ఎలక్షన్ కమీషన్ ను ఆశ్రయించడం వల్ల విరమించుకోకుండా పోటీలో ఉన్నామన్నారు.

ఈ ఎన్నికలలో చాలా స్థానాల్లో బిజెపి కి రెండవ స్థానం దక్కిందని అన్నారు. ప్రజలు గమనిస్తున్నారని, నీతి, నిజాయతీ గల పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క బిజిపి నేనని తెలుసుకుంటున్నారని, రాబోయే కాలంలో వెంకటగిరి నియోజకవర్గంలో అన్ని స్థానాలు బిజెపి కైవసం చేసుకుంటుందని ఎస్.ఎస్.ఆర్ నాయుడు జోస్యం చెప్పారు.

మీడియా సమావేశంలో ఎస్.ఎస్.ఆర్ నాయుడు తో పాటు బిజెపి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు శ్రావణ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కె.రమాకాంత్, సీనియర్ పాత్రికేయుడు

Related posts

ఘనంగా భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 31వ,వర్ధంతి

Satyam NEWS

సీనియర్ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత

Bhavani

ప్రధాన డిమాండ్ వదిలేశారుగా చర్చలు జరపండి

Satyam NEWS

Leave a Comment