38.2 C
Hyderabad
April 29, 2024 19: 40 PM
Slider ముఖ్యంశాలు

ఘనంగా భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 31వ,వర్ధంతి

#rajeevgandhi

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు

ఈ సందర్భంగా ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,పిసిసి మాజీ సభ్యుడు సాముల శివారెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రెటరీ మహ్మద్ అజీజ్ పాషా,మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,మాజీ జడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా పనిచేసిన సమయంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి మంచి కీర్తి ప్రతిష్టలు,గుర్తింపు తెచ్చారని అన్నారు.

నేడు భారతదేశంలో ప్రతి ఒక్కరూ సాంకేతికంగా ముందు ఉండటానికి నాటి ప్రధాని రాజీవ్ గాంధీనే అని అన్నారు.రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని అన్నారు.1944 ఆగస్ట్ 20న,జన్మించిన రాజీవ్ గాంధీ 1984 -1989 మధ్య కాలంలో భారత ప్రధానిగా సేవలందించారు.

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజీవ్ గాంధీని 1991 మే 21న తమిళనాడులోని పెరంబదూర్‌ లో ఎల్టీటీఈకి చెందిన ఆత్మాహుతి దళం చేతిలో దారుణ హత్యకు గురయ్యారని అన్నారు.40 ఏళ్ళ వ‌య‌సులో భార‌త యువ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాజీవ్‌ గాంధీ ప్ర‌పంచంలోనే అతి పిన్న‌ వ‌య‌స్కులైన ప్ర‌భుత్వాధి నేత‌లలో ఒక‌రని అన్నారు.దేశంలో త‌రం మార్పుకు సంకేతంగా రాజీవ్‌ గాంధీ దేశ చ‌రిత్ర‌ లోనే అతిపెద్ద మెజార్టీ సాధించారని,పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తెచ్చి,ఐటి,కమ్యూనికేషన్ రంగాల ఆవశ్యకతను ముందుగానే ఊహించారని గుర్తు చేశారు.

యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ కే దక్కుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బాచిమంచి గిరిబాబు, పట్టణ ఉపాధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లయ్య,యడవల్లి వీరబాబు,పార్టీ నాయకులు కోల్లపూడి యోహాన్,షేక్ సైదా మేస్త్రి,వల్లపుదాసు కృష్ణ,బెల్లంకొండ గురవయ్య,ఇట్టిమళ్ళ బెంజిమెన్,ముషం సత్యనారాయణ, పోతనబోయిన రామూర్తి, చింతూకాయల రాము,సందీప్,పాశం నారాయణ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మసీదు,ఈద్గాలకు మౌలిక వసతులు కల్పించండి

Satyam NEWS

అట్రాసిటి బాధితులకు వెంటనే సహాయం

Satyam NEWS

రా యాక్షన్ ఫిల్మ్ ‘థగ్స్’ మ్యూజిక్ పార్టనర్ గా సోనీ మ్యూజిక్

Bhavani

Leave a Comment