37.7 C
Hyderabad
May 4, 2024 14: 08 PM
Slider మహబూబ్ నగర్

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల పొట్టకొడుతున్న కేసీఆర్ సర్కార్

#bjym

రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొల్లాపూర్ ఎంపిడిఓ కార్యాలయం ముందు బీజేవైయం ఆందోళన చేసింది. ఈ సందర్భంగా బీజేవైయం జిల్లా అధ్యక్షులు భరత్ చంద్ర మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించాలని డిమాండ్ చేశారు.

ప్రతి పేద కుటుంబానికి సంవత్సరంలో కనీసం 100 రోజులు ప్రభుత్వమే పని కల్పించాలనే ఉద్దేశ్యంతో తీసుకువచ్చిన పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం నీరుగారుస్తున్నదని ఆయన అన్నారు. ఈ పథకం ద్వారా దేశంలోని పేదలందరికి పని కల్పించాలనేది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆలోచన కాగా ఇటువంటి పథకానికి గత 14 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్లు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.

మరోపక్క వారి మనుగడకే ప్రమాదం కలిగించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం 47,79 జీఓ లను తెచ్చిందని ఆయన తెలిపారు. ఈ జీవోలను వ్యతిరేకిస్తూ ఫీల్డ్ ఆఫీసర్లు 2020లో ఉద్యమం చేపట్టారని, ఆ సమస్యలను పరిష్కరించకపోగా వారందరిని విధులనుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని భరత్ చంద్ర తెలిపారు.

వీటిపై వారు కోర్టుకెళితే వారిని విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది..అయినా ప్రభుత్వం స్పందించకపోగా బీజేవైయం చేసిన పోరాటాలకు తలొగ్గి గత మార్చి 15వ తేదీనా నిండు అసెంబ్లీ సాక్షిగా వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారని ఆయన తెలిపారు.

అయితే ప్రకటించి 115 రోజులు గడిచినా వాటిపై స్పందించకపోవడాన్ని నిరసిస్తూ నేడు బీజేవైయం ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించి వినతిపత్రం అందజేయడం జరిగిందని భరత్ చంద్ర తెలిపారు. వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని లేనిపక్షంలో వారి కుటుంబాలతో కలిసి ఉద్యమకార్యాచరణ చేపడుతామని హెచ్చరించారు బీజేవైయం నేతలు.

ఈ కార్యక్రమంలో BJYM పట్టణ అధ్యక్షులు మెంటే శివకృష్ణ యాదవ్, BJYM పట్టణ ప్రధాన కార్యదర్శి బడా చందూ యాదవ్, మహేష్, బీజేపీ మండల, పట్టణ అధ్యక్షులు సాయికృష్ణ గౌడ్,కాకి సత్యనారాయణ,కడ్తాల కృష్ణయ్య,హైమావతి,శ్రీలక్మి,కాశీపురం మహేష్,ఎల్లయ్య,పినంశెట్టి శివ,ఓరే శేఖర్,మహేష్,చిన్నా తదితరులు పాల్గొన్నారు.

Related posts

కర్నాటక మద్యంపై పోలీసులు కన్నేసి ఉంచాలి

Satyam NEWS

భార్య కాళ్లు మొక్కి నిజాయితీగా తప్పొప్పుకున్న భర్త

Satyam NEWS

దేశ వైవిధ్యాన్ని మోదీకి తెలిసేలా చేసిన దీదీ

Satyam NEWS

Leave a Comment