38.2 C
Hyderabad
April 29, 2024 13: 16 PM
Slider మహబూబ్ నగర్

భార్య కాళ్లు మొక్కి నిజాయితీగా తప్పొప్పుకున్న భర్త

#lokadalat

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ ఆదాలత్ లో హృదయాలను కదిలించే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. గద్వాల పట్టణం సుంకులమ్మ మెట్టుకు చెందిన డ్రైవర్ గోవిందుకు రాజేశ్వరి అనే మహిళతో వివాహమైంది. అయితే గోవిందు తాగిన మైకంలో తరచు తన బార్యతో గొడవపడి చేయి చేసుకునేవాడు.  విసిగిపోయిన రాజేశ్వరి చివరకు గద్వాల పట్టణ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. దీనితో వీరి సమస్య కొన్ని రోజులు తరువాత రాజీ కొరకు జాతీయ లోక్ అదాలత్ కు చేరింది.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. కుషాతో పాటు జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి అన్నీ రోజ్ క్రిస్టియన్, సీనియర్ సివిల్ జడ్జి గౌ గంటా కవితా, జూనియర్ సివిల్ జడ్జి ఉదయ్ నాయక్ సమక్షంలో జరిగిన లోక్ అదాలత్ ఈ దంపతులను కలిపి దండలను మార్చుకొనేలా చేసింది. ఈ సందర్భంగా గోవిందు భావోద్వేగానికి గురువుతు తాగిన మైకంలో తన భార్యను కొడుతుండడం పొరపాటేనని నిజాయితీగా ఒప్పుకున్నాడు. దీనితో న్యాయమూర్తులు ఆమెకు సారీ చెప్పాలని కోరగా సారే కాదు… కాళ్లే మొక్కుతానని తన బార్య కాళ్ళను మొక్కాడు. వాస్తవం చెప్పాలంటే తన తల్లిదండ్రులకు మించి తన భార్య తనను చూసుకుంటుందని ఇక ముందు ఆలా చేయనని గోవిందు చెప్పాడు. ఈ దృశ్యాలతో  లోక్ ఆదాలత్ ఒక్క సారిగా చెప్పట్లతో మురిసిపోయింది.

Related posts

మహా శివరాత్రి సందర్భంగా దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు

Satyam NEWS

అప్రమత్తతతో పకడ్బందీగా పరీక్షల విధులు నిర్వర్తించాలి

Satyam NEWS

కరోనా వ్యాప్తి అరికట్టడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment