36.2 C
Hyderabad
April 27, 2024 22: 25 PM
Slider అనంతపురం

కర్నాటక మద్యంపై పోలీసులు కన్నేసి ఉంచాలి

#ananthapurpolice

అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ నేడు శ్రీసత్యసాయి జిల్లాలోని నల్లమాడ సర్కిల్ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్  తో కలసి పోలీసు స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా సరిహద్దు ప్రాంతం సమీపంలో ఈ సర్కిల్ పోలీసు స్టేషన్ లు ఉండటం వల్ల సరిహద్దుల్లో నిఘా పెంచాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.

కర్నాటక మద్యం,  పి.డి.ఎస్ రైస్, గ్రానైట్ అక్రమ రవాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ తరహా కేసుల్లో నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. తరచూ అక్రమ రవాణాలకు పాల్పడే వారిపై పి.డి యాక్టు ప్రయోగించాలని డి ఐ జి ఆదేశించారు. ఈ ఏరియాలో మహిళలపై నేరాలు, ఫోక్సో కేసులు తరుచూ జరుగుతున్న నేపథ్యంలో గ్రామ/వార్డు సచివాలయ పోలీసులను సమన్వయం చేసుకుని మహిళల్లో అవగాహన తీసుకొచ్చి అడ్డుకట్ట వేయాలని కోరారు. గ్రామ/వార్డు సచివాలయాల పోలీసులు ఇంటింటికి వెళ్లి మహిళలపై జరుగుతున్న నేరాలపై దృష్టి పెట్టాలని, అంతేకాకుండా సైబర్ నేరాలు, ముఖ్యంగా లోన్ యాప్ ల మోసాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ , ఫోక్సో నేరాలపై అవగాహన చేయాలని ఆదేశించారు.

ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉన్న గ్రామాల్లో నియంత్రణలో ఉన్నప్పటికీ నిఘా కొనసాగించాలి. ఫ్యాక్షన్ గ్రామాల్లో ఎలాంటి ఘటనలకు తావులేకుండా నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఎస్సైలు సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించి పల్లె నిద్రలు చేపట్టాలి. తాజా సమస్యలను గుర్తించి సద్దుమణచాలి.  ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజల్లో మరింత చేరువ కావాలి అని ఆయన కోరారు. హత్యలు, అత్యాచారాలు, తదితర గ్రేవ్ కేసుల్లోని సాక్షులతో సి.ఐ లు మాట్లాడి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని డి ఐ జి ఆదేశించారు. అదే విధంగా మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ , తదితర అసాంఘిక కార్యకలాపాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వార్షిక తనిఖీలో డి.ఐ.జి, ఎస్పీలతో  పాటు కదిరి డీఎస్పీ భవ్యకిశోర్ , నల్లమడ  సి.ఐ నిరంజన్ రెడ్డి, సర్కిల్ ఎస్సైలు ఉన్నారు.

సత్యం న్యూస్.నెట్, అనంతపురం

Related posts

మహిళల జీవించే హక్కును కాలరాయ వద్దు

Satyam NEWS

కర్ఫ్యూ ఉత్తర్వులు కొద్ది సేపటి క్రితమే విడుదల..!

Satyam NEWS

దిశ చట్టాన్ని జాతీయ చట్టంగా రూపొందించాలి

Satyam NEWS

Leave a Comment