39.2 C
Hyderabad
May 4, 2024 21: 50 PM
Slider ప్రత్యేకం

ఎమ్మెల్యే బీరం ఇలాకాలో మంత్రి హరీష్ రావుకు నిరసన సెగలు

#ministerharishrao

రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై బీజేవైఎం నాయకులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావును నిలదీశారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని, ప్రశ్నించే గొంతుకలను అరెస్టులతో నిర్బంధాలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందని బీజేవైఎం నాయకులు ఆరోపించారు. కెసిఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని నినాదాలు చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని రోడ్లపై పడుకొని నిరసనలు తెలిపారు.

నిర్బంధాలు అరెస్టులు ప్రజల మధ్య సంబంధాన్ని తెంపలేవన్నారు. మంగళవారం నాడు నాగర్ కర్నూల్ జల్లా కొల్లాపూర్ లో 50 పడకల మాతాశిశు కేంద్రాన్ని ప్రారంభించడానికి ఆయన  వస్తున్న సమయంలో ఈ నిరసనలు వెలువడ్డాయి. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇలాకా  లో 50పడకల ఆస్పత్రి ప్రారంభానికి వస్తున్న సమయంలో  ఈ ఘటన చోటచేసుకుంది.

మంత్రి హరీష్ రావు కాన్వాయ్ ని  బీజేవైఎం  నాయకులు పెంట్లవెల్లిలో  మెరుపు వేగంతో వచ్చి జెండాలు పట్టుకుని రోడ్డుకు అడ్డంగా పడుకొని నిరసనలు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ వెయ్యాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ఎంటర్ అయ్యి  బిజేపి, బీజేవైఎం నాయకులను అడ్డుకున్నారు. మొత్తం మీద కొద్ధి సేపు మంత్రి కాన్వాయిని అపి పక్క నుండి తరలించారు.

Related posts

ఖమ్మం అసెంబ్లీకి జావీద్ దరఖాస్తు

Bhavani

వాలెంటైన్ డే ను విడిచి అమరులను స్మరించుకుందాం

Satyam NEWS

గో గ్రీన్: నటులు, నిర్మాతల గ్రీన్ ఇండియా ఛాలెంజ్

Satyam NEWS

Leave a Comment