26.7 C
Hyderabad
May 3, 2024 07: 58 AM
Slider రంగారెడ్డి

వాలెంటైన్ డే ను విడిచి అమరులను స్మరించుకుందాం

bhajrangdal

వాలెంటైన్స్ డే ను బహిష్కరించాలని కొందర్గ్  భజరంగ్ దళ్ శాఖ పిలుపునిచ్చింది. ఈ నెల 14న  వాలెంటైన్స్ డే ను జరుపుకోవద్దని, ఆ రోజు అమరులను స్మరించుకోవాలని మండల ప్రముఖ్ సత్యనారాయణ, సహ ప్రముఖ్ ప్రశాంత్ రెడ్డి సూచించారు. కొందుర్గ్ గ్రామంలోని ఉమామహేశ్వర దేవాలయం ఆవరణలో వాలెంటైన్స్ డే కు వ్యతిరేకంగా వాల్ పోస్టర్ ను నేడు విడుదల చేశారు.

యువత ప్రాశ్చాత్య సంస్కృతిని వీడి స్వదేశీ సంస్కృతిని అలవర్చుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. 365 రోజులూ ప్రేమించుకునే రోజులు కావలి తప్ప కేవలం ఫిబ్రవరి 14 న ఉదయం పుట్టి సాయంత్రం ముగిసే ప్రేమ మనకు వద్దు వారన్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి 14 పుల్వామా ఉగ్రవాదులు దాడి అమరులైన సైనికులకు ఈ సందర్భంగా స్మరించుకుని నివాళి అర్పిద్దామని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చిలం లింగం సంతోష్  జగన్ గౌడ్, కృష్ణ,  కావలి గణేష్,  శ్రీనివాస్, యాదగిరి రాజు, నర్సింలు, మహేందేర్, రమేష్, మహేష్, అనిల్,  వెంకటయ్య,  జగన్,  శివకుమార్, శేఖర్, నరేష్, మణికంఠ  భజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

అట్టహాసపు ప్రకటనలు… సొట్టలు పడ్డ రోడ్లు

Satyam NEWS

గంజాయి కోసం ఆబ్కారీ అధికారుల వేట

Satyam NEWS

అంతర్మథనం

Satyam NEWS

Leave a Comment