39.2 C
Hyderabad
May 3, 2024 13: 19 PM
Slider వరంగల్

పర్యాటక రంగం అభివృద్ధిలో గైడ్స్ పాత్ర ముఖ్యమైనది

#ramappatemple

శిల్ప కళకు పుట్టినిల్లు,ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయం విశిష్టత ప్రపంచ దేశాలలో వినబడుతున్నదంటే అందుకు కారణం గైడ్స్ కృషి,పట్టుదల ఎంతో ఉందని ములుగు,భుపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. మంగళవారం జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా రామప్ప దేవాలయం సందర్శించి,గైడ్లుగా  పనిచేస్తున్న గోరంట్ల విజయ్ కుమార్, తాడబోయిన వెంకటేష్లను శాలువాలతో సన్మానించారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ దేశంలో పర్యాటక రంగం అభివృద్ధిలో గైడ్స్ ముఖ్యపాత్ర వహిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అందించే గౌరవ వేతనంతో పని చేస్తూ దేవాలయాల ప్రాముఖ్యతను తెలుగు,హిందీ,ఇంగ్లీష్ భాషలలో తమదైన శైలిలో వివరిస్తూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నారని అన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావటంలో గైడ్స్ కృషి,పనితీరు అద్భుతమని ఆమె కొనియాడారు. కాగా తమను గుర్తించి తమకు సన్మానం చేసిన తస్లీమా కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ అధికారులు,సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు.

Related posts

భార్యను వేధిస్తున్న డాక్టర్ భర్త అరెస్టు

Satyam NEWS

రాజేంద్రనగర్ ప్రాంతంలో తిరుగుతున్న మరో చిరుత

Satyam NEWS

రూ. 76 లక్షలు హవాలా నగదు స్వాధీనం

Bhavani

Leave a Comment