34.7 C
Hyderabad
May 4, 2024 23: 34 PM
Slider నల్గొండ

దేశ రాజధానిలో సుదీర్ఘ పోరాట రైతులకు రెడ్ సెల్యూట్

#CITU

భారతదేశ చరిత్రలో సుదీర్ఘ కాలం పోరాటం చేస్తున్న దేశ రాజధాని ఢిల్లీ లోని రైతులకు రెడ్ సెల్యూట్ చేస్తున్నామని సూర్యాపేట జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నేడు బ్లాక్ డే ను నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా బ్లాక్ డే నిర్వహించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ దిష్టి బొమ్మను సి ఐ టి యు ఆధ్వర్యంలో దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా రోషపతి మాట్లాడుతూ దేశంలో రెండో దశ కరోనా విలయతాండవం చేస్తున్న విషయం దృష్టిలో పెట్టుకొని బిజెపి ప్రభుత్వం తక్షణమే వ్యవసాయ 3 చట్టాలను, నాలుగు కార్మిక కోడ్ లను,విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు,

వైద్య రంగం కార్పొరేట్ సంస్థల గుప్పెట్లో ఉంటే ప్రజల ప్రాణాలు ఎలా గిల గిల ఆడుతున్నారో మనం ప్రత్యక్షంగా చూస్తున్నామని, మనం తినే తిండి గింజలు కూడా కార్పొరేట్ చేతి లోకి వెళ్తే తిండిలేక ప్రాణాలు పోయే రోజులు దాపురిస్తాయని,అందుకోసం రైతు సంఘాలు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారని, అందుకు మన దేశ వ్యాప్తంగా వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, ఎంపీలు ప్రధానిపై ఒత్తిడి తెచ్చి తక్షణమే వ్యవసాయ 3 చట్టాలని రద్దు చేయించాలని డిమాండ్ చేశారు.

జూనియర్ డాక్టర్ల సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే కరోనా సమయంలో ప్రజలకి  ప్రమాదం పొంచి ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు చింతకాయల పర్వతాలు, బజారు హమాలీల యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు మైపాల్, ప్రేమ్,వెంకన్న, పెంటయ్య,కత్తి రాకేష్,దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

నెహ్రూ స్మారక తపాలా బిళ్ల విడుదల చేయనున్న శ్రీలంక

Satyam NEWS

నాలుగు నెలలు గా జీతాలు రాక సమగ్రా శిక్షా ఉద్యోగి ఆత్మహత్య…

Satyam NEWS

స్కార్పీన్‌ జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ ఖండేరీ

Satyam NEWS

Leave a Comment