38.2 C
Hyderabad
April 27, 2024 18: 24 PM
Slider కర్నూలు

నాలుగు నెలలు గా జీతాలు రాక సమగ్రా శిక్షా ఉద్యోగి ఆత్మహత్య…

#ramana

కర్నూల్ జిల్లా ఆదోని మండలంలో మండల విద్యా శాఖా అధికారి కార్యాలయం లో మండల అకౌంట్ టెంట్ గా పనిచేస్తున్న రమణ గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. 3 నెలలు దాటి 4వ నెల వచ్చినప్పటికీ ఇంతవరకు ఏపీ ప్రభుత్వం సమగ్రా శిక్షా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. ఇంటి యజమాని వచ్చి 4నెలల అద్దె ఇవ్వమని గోవవపెట్టడంతో కొద్ది రోజులు ఆగండి ఇస్తానని చెప్పగా, ఇల్లు వెంటనే కాళీ చేయమని యజమాని గొడవ చేయడం జరిగింది. 3 నెలలుగా పిల్లల స్కూల్ పీజు లు కట్టలేకపోవడం, పిల్లల స్కూల్ ఆటో ఛార్జిలు ఇవ్వలేకపోవడం, ఇంట్లో కనీస అవసరాలు తిర్చు కోవడానికి కూడా డబ్బులు లేవని ఒక పేపర్లో రాసి మనస్తాపం చెంది పురుగులు మందు తాగి ఇంటివివద్దనే రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు.ఇది సమగ్రా శిక్షా ఉద్యోగుల దీన పరిస్థితి కి అద్దం పడుతోంది.

Related posts

భారతీయ వలసదారులకు వరాలు కురిపించబోతున్న బైడెన్

Satyam NEWS

ఢిల్లీలో పాత వాహనాలపై ఉక్కుపాదం

Bhavani

కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుకున్నా మారరా?

Satyam NEWS

Leave a Comment