28.7 C
Hyderabad
May 5, 2024 09: 18 AM
Slider నిజామాబాద్

న్యూడ్ వీడియో కాల్.. ఆపై బెదిరింపులు

#nudevideocall

న్యూడ్ కాల్ చేసి ఆ కాల్ రికార్డు అయిందంటూ డబ్బులు వసూలు చేయడం ఇటీవల పరిపాటిగా మారింది. అపరిచిత కాల్స్ రిసీవ్ చేసుకోవద్దని పోలీసులు పదేపదే చెప్తున్నా యువత పెడచెవిన పెడుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకునికి న్యూడ్ కాల్ చేసిన ఓ యువతి అది రికార్డు అయిందని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటన కలకలం రేపింది.

సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన యువకునికి రెండు రోజుల క్రితం ఢిల్లీకి చెందిన ఓ యువతి అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో సమయంలో యువతి న్యూడ్ వీడియో కాల్ చేయడంతో యువకుడు మాట్లాడాడు. నీతో మాట్లాడిన వీడియో కాల్ రికార్డు అయిందని ఆ యువతి చెప్పడంతో ఖంగుతిన్నాడు.

అక్కడితో ఆగని ఆ యువతి తనకు లక్ష రూపాయలు పంపాలంటూ యువకునికి బెదిరించింది. ఈ సమయంలోనే మరొకరు రంగంలోకి దిగారు. ఢిల్లీకి చెందిన కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను ఓ వ్యక్తి మాట్లాడాడు. మీపైన ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వచ్చిందని యువకుని బెదిరింపులకు గురి చేశారు. లక్ష రూపాయలు పంపాలి లేకపోతే మీ పైన కేసు పెడతామంటూ యువకునికి బెదిరించారు.

దీంతో భయాందోళన గురైన యువకుడు విడతల వారీగా 60 వేల రూపాయలను ఆన్ లైన్ అకౌంట్ ద్వారా పంపించాడు. అయినా వేధింపులు, బెదిరింపులు ఆగకపోవడంతో సదరు యువతిపై కేసు నమోదు చేయాలంటూ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. యువకుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి పట్టణ పోలీసులు తెలిపారు.

Related posts

వైభవంగా శ్రీ వేణుగోపాల, సీతారామచంద్ర స్వామి కోవెలలో లక్ష కుంకుమార్చన

Satyam NEWS

కుట్టు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయకులు

Satyam NEWS

మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం: దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment