31.7 C
Hyderabad
May 2, 2024 08: 04 AM
Slider విజయనగరం

విజయనగరం లో జేరాక్స్ షాప్స్ మూసివేత…!

#vijayanagaramSP

19న ఎస్ఐ ఉద్యోగ నియామకాల ప్రాధమిక వ్రాత పరీక్షకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెన్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (ఎ.పి.ఎస్.ఎల్.పి.ఆర్.బి.) ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగ నియామకాలకు ఈ నెల 19న నిర్వహిస్తున్న ప్రాధమిక వ్రాత పరీక్షకు అన్ని భద్రతా చర్యలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక  తెలిపారు. ఈ వ్రాత పరీక్షను జిల్లాలో 10 పరీక్షా కేంద్రాల్లో పేపరు – 1 పరీక్షను ఉదయం 10గంటల నుండి మద్యాహ్నం 1గంట వరకు, పేపరు – 2 పరీక్షను మద్యాహ్నం 2-30 గంటల నుండి సాయంత్రం 5-30 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. విజయనగరంలో 10 పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు.

ఇప్పటికే సంబంధిత పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాలను సందర్శించి, స్ట్రాంగ్ రూంలు, భద్రత, సిసి కెమెరాల పనితీరును పర్యవేక్షించారన్నారు. ప్రాధమిక వ్రాత పరీక్ష ప్రారంభానికి గంట ముందు నుండి అభ్యర్ధులను పరీక్షించి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. వ్రాత పరీక్ష ప్రారంభమైన తరువాత ఎవ్వరినీ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని జిల్లా ఎస్పీ స్పష్టం చేసారు. అంతేకాకుండా, అభ్యర్థులు తమ వెంట తమ  హాల్ టిక్కెట్స్ లో సూచించిన నియమ, నిబంధనలు అభ్యర్ధులు కుణ్ణంగా చదువుకొని, వాటిని పాటించాలన్నారు.

పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, డిజిటల్ వాచ్లు, బ్లూ టూత్, కాలిక్యులేటర్లు తదితర అనుమతించమన్నారు. పరీక్షా కేంద్రాల దగ్గరు 144 సి.ఆర్.పి.సి. అమలులో ఉంటున్నందున, ఎవ్వరూ గుంపులుగా ఉండకూడదన్నారు. అంతేకాకుండా, పరీక్షా కేంద్రాలకు దగ్గరలోగల జెరాక్స్ షాపులను మూసి వేయిస్తామన్నారు. అభ్యర్థుల సౌలభ్యం కొరకు వారికి దిశా నిర్దేశం చేసేందుకు రైల్వే స్టేషను, బస్సు స్టేషనులో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తామన్నారు. పరీక్ష నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక ఇన్స్పెక్టరు స్థాయి అధికారిని బాధ్యతగా నియమించామన్నారు.

అదే విధంగా పరీక్షా కేంద్రాల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా మూడు ప్లైయింగ్ స్వ్కాడ్లను కూడా నియమించామన్నారు. జె.ఎన్.టి.యూ.పరీక్షా కేంద్రానికి వెళ్ళేందుకు వాహనాల సౌకర్యం లేనందున పోలీసుశాఖ ప్రత్యేకంగా రెండు వాహనాలను ఏర్పాటు చేసిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ వాహనాలు అభ్యర్థులను జె.ఎన్.టి.యు. జంక్షన్ నుండి పరీక్షా కేంద్రం వరకు తీసుకొని వెళ్ళేందుకు, తిరిగి జె.ఎన్.టి.యు. జంక్షన్ కు చేర్చేందుకు వినియోగిస్తామని, అభ్యర్ధులు ఈ ఉచిత రవాణ సౌకర్యంను సద్వినియోగం చేసుకోవచ్చునన్నారు. ప్రాధమిక వ్రాత పరీక్ష నిర్వహించే జె.ఎన్.టి.యు, సీతం, ఎం.వి.జి.ఆర్., లెండీ, ఎజిఎల్, ఎం.ఆర్.ఎ. కాలేజ్, శ్రీ చైతన్య, భాష్యం కళాశాలలు, స్కూల్స్ వద్ద భద్రతా ఏర్పాట్లును విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు పర్యవేక్షణాధికారిగా నియమించినట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.

Related posts

ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తల అసెంబ్లీ ముట్టడి

Satyam NEWS

బద్వేలు ఉపఎన్నికలో వైస్సార్సీపీ కక్కుర్తి రాజకీయాలు

Satyam NEWS

సమాజ శ్రేయస్సు పరమావధి కావాలి

Sub Editor

Leave a Comment