37.7 C
Hyderabad
May 4, 2024 13: 51 PM
Slider రంగారెడ్డి

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

#airport

హైదరాబాద్ లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్ – చెన్నై విమానంలో బాంబు పెట్టామంటూ ఓ దుండగుడు ఫోన్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలను నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎయిర్ పోర్టులోనే ఉన్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. చెన్నైలో సీనియర్ ఇంజినీర్ గా పని చేస్తున్న అజ్మీరా భద్రయ్య అనే వ్యక్తి ఈ కాల్ చేసినట్టు గుర్తించారు. విమానాశ్రయానికి ఆయన లేట్ గా రావడంతో ఆయనను ఎయిర్ లైన్స్ సిబ్బంది అనుమతించలేదు. దీంతో, ఆయన ఈ బెదిరింపు కాల్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Related posts

కో ఎగ్జిస్టెన్స్: మతసామరస్యానికి నిదర్శనం రంగాపూర్ ఉత్సవాలు

Satyam NEWS

విధి నిర్వహణలో గాయపడ్డ కానిస్టేబుల్ కు ఎస్పీ పరామర్శ

Bhavani

జైలుకు బెయిల్ కు మధ్యనున్న జాక్వెలిన్

Satyam NEWS

Leave a Comment