35.2 C
Hyderabad
April 27, 2024 11: 09 AM
Slider ముఖ్యంశాలు

రోబోటిక్స్, సైబర్ ఫిజికల్ మెషీన్‌లపై అంతర్జాతీయ సమావేశం

#cbit

గత కొద్ది కాలంగా ప్రపంచం వ్యాప్తంగా కంప్యూటర్ సైన్స్ రంగంలో జరుగుతున్న పరిశోధన ఫలితాలు అద్భుతం గా వున్నాయి. ఈ ఫలితాలను పంచుకోవడానికి, మరింతగా వ్యాప్తి చేయడానికి విద్యావేత్తలు, పరిశోధకులు, డెవలపర్‌లు , విద్యాసంస్థలు, శాస్త్రీయ సంస్థలు మరియు పరిశ్రమల వారిని ఒకే చోట ఉంచడం సవాలుతో కూడుకున్న పని. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో రోబోటిక్స్ మరియు సైబర్ ఫిజికల్ మెషీన్‌లపై సీబీఐటి  కళాశాల లో అంతర్జాతీయ సమావేశం నిర్వహించబోతున్నారు. హైబ్రిడ్ పద్ధతి (ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్)లో ఈ సమావేశం జరగనునన్నదని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు.

ఈ సమావేశం లో  ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, వాటి అనువర్తనాలు, కీలక ఫలితాలను చర్చించడానికి, కొత్త  ఆలోచనలను చర్చించుకోవటానికి, ప్రపంచ స్థాయి పరిశోధకుల ఉపన్యాసాలను వినడానికి దీన్ని నిర్దేశించినట్లు ఆయన చెప్పారు. పీర్ గ్రూపులతో అనుభవాలను పంచుకోవడానికి ఇది ఒక అత్యుత్తమ వేదిక అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ సదస్సు పరిశోధనా సంస్థలకి  ప్రసిద్ధి చెందిన జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థల సహకారానికి అవకాశాలను మెరుగుపరుస్తుందని సిబిఐటి కళాశాల ప్రొఫెసర్ రజనీకాంత్ అలువాలు అన్నారు. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి సుమారు 100 పరిశోధన పత్రాలు  వచ్చాయని, మరిన్ని వస్తాయని ఆశిస్తున్నట్టు  డాక్టర్ సుధాకర్ బాబు, డాక్టర్ రమణ కడియాల తెలిపారు. ఈ సమావేశం యూనివర్శిటీ తున్ హుస్సేన్ ఆన్ మలేషియా వ్యూహాత్మక భాగస్వామి గా వ్యవహరిస్తునట్టు సిబిఐటి కళాశాల పరిశోధన మరియు అభివృద్ధి విభాగ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ డి శర్మ తెలిపారు. ముఖ్య వక్తలు గా రాజ్ జైన్, హసన్ హేస్ అల్హేలౌ, కునాల్ మంకోడియా, బెల్కాసెమ్ అల్జాఫారి, మొహమ్మద్ హెల్మీ అబ్ద్ వహాబ్  వ్యహరించనున్నారని ప్రొఫెసర్ ఎన్ వి శ్రీనివాస్, జి మల్లికార్జున రావు తెలిపారు.

ఈ సమావేశం లో  ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను  కృతిమ మేధస్సు  మరియు రోబోటిక్స్ ఎలా మార్చబోతున్నాయి , క్లౌడ్ రోబోటిక్స్ ద్వారా రోబోటిక్స్-ఏ-సర్వీస్ ఫ్రేమ్‌వర్క్‌, పరిశ్రమ కోసం సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ మరియు  కాగ్నిటివ్ అనలిటిక్స్ అమలు చేయడానికి కావసిన కొత్త పద్ధతులు అనే అంశాలు మీద కార్యశాలలు ఉంటాయి అని క్రియాశీలక కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశం గురించి ప్రపంచవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయ కు , పరిశోధన సంస్థలకు సమాచారం పంపించినట్టు కళాశాల పిఆర్ఓ డాక్టర్ జిఎన్ఆర్ ప్రసాద్ తెలిపారు.

Related posts

గిరిజన జాతిని మోసం చేసిన సీఎం కేసీఆర్

Satyam NEWS

పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం

Satyam NEWS

పేకాట శిబిరాలపై దాడి చేసిన గుడివాడ ఎస్ ఐ ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment