28.7 C
Hyderabad
April 28, 2024 03: 16 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి మున్సిపాలిటి అవినీతి ఆక్రమాలపై కలెక్టర్ కు పిర్యాదు 

#complaint

వనపర్తి మున్సిపాలిటి అవినీతి ఆక్రమాలపై చర్యలు తీసుకోవాలని అఖిల పక్షం ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ జిల్లా కలెక్టర్ కు అందజేసిన పిర్యాదులో   కోరారు. పిర్యాదుపై విచారణ చేసి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. గత కొన్నేళ్లుగా వనపర్తి పట్టణంలో గ్రామకంఠం,  ప్రభుత్వ భూములు మాయమైపోతున్నాయని వాటిని రక్షించాలని, అలాగే లే అవుట్లలో ఇచ్చిన పార్కులను అమ్మేసుకుంటున్న ప్రజాప్రతినిధులను శిక్షించాలని కోరారు.

కెడిఆర్ పార్కులో ఒక ఏజెన్సీ కోసం 30 చెట్లు నరకివేసి, నివాస స్థలాలలో అక్రమంగా పెట్టిన ఏజెన్సీతో డబ్బు వసూలు చేసి, పార్కులు కుదించి చేస్తున్న అక్రమాన్ని అరికట్టాలని, అలాగే మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని, మూగజీవాలను పట్టుకోవడానికి తీర్మానం చేసి, వాటిని చంపడం నేరమని, వాటిపై కూడా కూడా కమిషన్ తింటున్న వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఇచ్చే బత్యాలు కూడా మూడు సంవత్సరాల నుండి ఇవ్వడం లేదని వారికి సబ్బులు, నూనె, ఇతర వస్తువులు కూడా ఇవ్వకుండా వారి డబ్బులు ఎక్కడ పెడుతున్నారని ప్రశ్నించారు.

వనపర్తిలో రోడ్డు వెడల్పు అవసరమని అందరూ దానికి సహకరిస్తే కొందరు మాత్రము ప్రజలను వేధిస్తూ అక్కడక్కడ మిగిలిన స్థలాలను అమ్ముకుంటూ ఇష్టం వచ్చినట్టు చోట డబ్బాలు వేయిస్తూ, డబ్బులు వసూలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్, వెంకటేశ్వర్లు, జానంపేట రాములు, పొట్టినేని గోపాలకృష్ణ నాయుడు, రమేష్ పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

Plank Room Online marketing

Bhavani

G20 దేశాలకు నాయకత్వం వహించేందుకు భారత్ రెడీ

Satyam NEWS

పంచాయితీ ఎన్నికలకు మరో మొలిక పెట్టిన ఏపి ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment