36.2 C
Hyderabad
May 8, 2024 18: 52 PM
Slider రంగారెడ్డి

చర్లపల్లి డివిజన్‌లోని పలు కాలనీలను సందర్శించిన కార్పోరేటర్‌ బొంతు శ్రీదేవి

#charlapally

గులాబ్‌ తుఫాన్‌ కారణంగా డివిజన్‌లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటికి రావాలని  కార్పోరేటర్‌ బొంతు శ్రీదేవి సూచించారు.  రాత్రి కురిసిన భారీ వర్షాలకు డివిజన్‌లోని  పలు కాలనీలు జలమయ మయ్యాయి. జలమయమైన కాలనీలు సోనియాగాంది నగర్‌, ఈస్ట్‌ గాందినగర్‌, బీఎన్‌రెడ్డి నగర్‌ లోని నాలాకు ఇరు పక్కల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ద్వారకాపురి నగర్‌ లోని నాలాను ఆనుకుని ఉన్న ఇంటి పహరీ గోడ కూలి నాలాలో పడటం వలన నాలా పూడిపోయి వరద కాలనీలోకి ప్రవహిస్తుండటంతో కార్పోరేటర్‌ పరిశీలించి జిహెచ్‌ఎమ్‌సీ సిబÊందితో నాలాలో కూరుకుపోయిన పహరీ ఇటుకలను తొలగించి క్లియర్‌ చేయించారు.

ఈ సందర్బంగా కార్పోరేటర్‌ బొంతు శ్రీదేవి మాట్లాడతూ గులాబ్‌ తుఫాను ప్రభావము రాష్ట్రవ్యాప్తంగా ఉందని , ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని సూచించారు. ముంపు ,నాలా పరావాహక ప్రాంతాల్లో పర్యవేక్షణ, సహాయక చర్యలు వెంటనే చేపడతామని ప్రజలు ఎవ్వరూ భయబ్రాంతులకు గురికావద్దని తెలిపారు. ఎవరికి ఎలాంటి సహాయ సహకారాలు అవసరమున్నా తన దృష్టికి తీసుకురావాలని ఎల్ల వేళలా అందుబాటులో ఉంటానని కార్పోరేటర్‌ తెలిపారు

Related posts

విజయవాడలో 6న సమరసత సమ్మేళనం

Bhavani

కాషన్ డిపాజిల్ వెంటనే రిటర్న్ ఇవ్వని తిరుమల దేవస్థానం

Satyam NEWS

అడిటర్ బుచ్చిబాబుపై ఈడీ ప్రశ్నల వర్షం

Bhavani

Leave a Comment