26.7 C
Hyderabad
April 27, 2024 07: 41 AM
Slider పశ్చిమగోదావరి

గులాబ్ తుఫాన్ ప్రభావంపై క్షేత్రస్థాయిలో పరిశీలన

#pedavegimandal

పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండల పరిషత్ అధ్యక్షురాలు తాతా రమ్య సోమవారం రామసింగవరం గ్రామంలో పర్యటించారు.

గులాబ్ తుఫాన్ ప్రభావం వల్ల గ్రామంలో పరిస్థితుల ను తెలుసుకునేందుకు ఎం పి పి రమ్య దెందులూరు ఏ ఎం సి చైర్మన్ మేకా లక్ష్మణరావు, మండల వై సి పి సీనియర్ నాయకులు పెడవేగి మాజీ సర్పంచ్ తాతా సత్యనారాయణ, పేదవేగి మండల వై సి పి అధ్యక్షులు మెట్లపల్లి సూర్య చంద్రరావు, పెదవేగి సొసైటీ చైర్ పర్సన్ పెనుమాక వెంకట సుబ్బారావు, కూచింపూడి ఎం పి టి సి సభ్యులు కాళీ చిన్న బుద్దియ్య, కూచింపూడి మాజీ సర్పంచ్ బొల్లా హనుమంతరావు, కూచింపూడి వై సి పి నాయకులు సొంగా పోతురాజు, గ్రామ వై సి పి నాయకులు మాజీ సర్పంచ్ కొట్టు రాంబాబు, రాచపల్లి గంగాధర్  తో కలిసి రామసింగవరం లో పర్యటించి తుఫాన్ వల్ల గ్రామంలో పంటలు, గృహాలు, రహదారులు, విద్యుత్ సరఫరా లాంటి నష్టాలేమైనా జరిగాయా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.

తుపాన్ అనంతరం గ్రామంలో పూర్తి శానిటేషన్ చేయిస్తామని ఎం పి పి రమ్య చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎం పి టి సి అభ్యర్థిగా పోటీచేసి ప్రమాదవశాత్తు మృతిచెందిన గోపిశెట్టి కృష్ణమూర్తి కుటుంబాన్ని ఎం పి పి రమ్య పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పెద వేగి వైద్యాధికారి తాతా ప్రసన్నకుమార్, మువ్వల రాజు పాల్గొన్నారు.

Related posts

తెరాసలో చేరిన హుజూరాబాద్ విద్యార్థి సంఘ నేతలు

Satyam NEWS

పారిశ్రామిక కారిడార్ ల పనులు తక్షణమే చేపట్టండి

Satyam NEWS

ఉత్తరప్రదేశ్ లో మరో దళిత యువతిపై దారుణం

Satyam NEWS

Leave a Comment