28.2 C
Hyderabad
April 30, 2025 06: 13 AM
Slider కరీంనగర్

బ్రాహ్మణుల సంపూర్ణ మద్దతు టి.ఆర్.ఎస్ పార్టీకే

vemulawada brahmins

వేములవాడ లోని బ్రాహ్మణ సత్రం మాజీ అధ్యక్షులు మధు రాజేందర్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సమక్షంలో టి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ పార్టీలో చేరిన అందరికి స్వాగతం పలికారు. వేములవాడ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగురవేయాలని అన్నారు. పార్టీ గెలుపుకు అందరూ సమష్టి కృషి చేయాలన్నారు.

అనంతరం మధు రాజేందర్ మాట్లాడుతూ బ్రహ్మణుల సంపూర్ణ సహకారం టి.ఆర్.ఎస్ పార్టీకి ఉంటుందని నిజాయితీగా ప్రజలకు సేవచేసే ఎమ్మెల్యేతో కలిసి టి.ఆర్.ఎస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తామన్నారు. మధు రాజేందర్ తో బాటు గోపన్నగారి మాధవి, గోపన్నగారి వెంకన్న, రాగంపేట హరిబాబు, మామిడిపల్లి రాజన్న, సరిత, స్వప్న, కేషన్నగారి శ్రీదేవి  పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ,యాచమనేని శ్రీనివాస్, గడ్డం హనుమాండ్లు, నామాల లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ తక్షణమే నిలిపివేయాలి

Satyam NEWS

విజయనగరం ఎమ్మెల్యే ను కలిసిన కొత్త మున్సిపల్ కమిషనర్

Satyam NEWS

మహిళల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!