36.2 C
Hyderabad
May 14, 2024 17: 32 PM
Slider వరంగల్

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ పేరుతో అవమానం

#journalist

అక్రిడిటేషన్ పేరుతో విలేకర్లలను అవమానించిన  సంఘటన మొగుళ్లపల్లిలో చోటు చేసుకుందని టీడబ్ల్యూజేయూ (ఐజేయూ) మొగుళ్లపల్లి మండల ఉపాధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తెలిపారు.

అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా సంస్థ ఇచ్చిన ఐడీ కార్డు ద్వారా జిల్లాలోని విలేకర్లందరికీ వ్యాక్సినేషన్ వేయాలని సంబంధిత మండలాల వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ కోరినప్పటికీ అలా చేయడం లేదని ఆయన అన్నారు.

మొగుళ్లపల్లి మండలంలోని సంబంధిత వైద్యాధికారులు మాత్రం అక్రిడిటేషన్ ఉన్న విలేకర్ల పేర్లు మాత్రమే జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి తమకు వచ్చాయని, వారికి మాత్రమే మేము వ్యాక్సినేషన్ వేస్తామని తెలిపి అవమానించారని ఆరోపించారు.

16 నెలలుగా కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా తమ ప్రాణాలను సైతం పక్కకు పెట్టి వార్తలను సేకరిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం చెప్పేదొకటి..చేసేదొకటి అనే రీతిన వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు.

నిరంతరం కరోనా మహమ్మారితో పోరాడుతున్న ప్రతి ఒక్క విలేఖరికి అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

పెంచుతున్న పన్నుల సొమ్ము అంతా సొంత పత్రికకే

Satyam NEWS

వైకుంఠ ఏకాదశి సంఘటనలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి

Satyam NEWS

త్వరలో 250 కొత్త పంచాయతీలు

Bhavani

Leave a Comment