33.2 C
Hyderabad
May 12, 2024 14: 22 PM
Slider విశాఖపట్నం

విశాఖలో బ్రాహ్మణ అభ్యుదయ సమాజం వనసంతర్పణ

dronamraju srinivas

తెలగాణ్య బ్రాహ్మణ అభ్యుదయ సమాజం ఆధ్వర్యంలో ముడసర్లోవ పార్క్ ప్రక్కన తోటలో వనసంతర్పణ -2019 ఘనంగా జరిగింది. ఈ వన సంతర్పణకు విఎమ్ఆర్ డిఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ఆత్మీయ అతిధిగా  హాజరై మాట్లాడుతూ తెలగాణ్య బ్రాహ్మణ సమాజం వారు గత నాలుగు దశాబ్దాలుగా  చేస్తున్నకార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. 

గత నెలలోనే రూ. 87 లక్షలు రుణాలను పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఇప్పించి స్వయంఉపాథి ద్వారా వల్ల  కాళ్లపై వారు నిలబడేట్లుగా చేశారని ఆయన అన్నారు. బ్రాహ్మణులు ఎప్పుడూ సర్వే జనః సుఖినోభవంతు అనే విధంగా ఉంటామని, ఈనాడు భారతదేశం సుసంపన్నంగా ఉందంటే మనం అందించిన వేదాలు, సంస్కృతి కారణమని అన్నారు.

అందుకే భారత దేశం భిన్న మతాలు, కులాలతో వసుదైక కుటుంబగా విరాజిల్లుతోందని ఆయన తెలిపారు.ఒక కందుకూరి వీరేశలింగం గారూ, ఆంధ్రా కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు తదితర మహనీయులు సమాజానికి ఎంతో సేవాలందించారు. మనం విద్య నేర్పగలం, సభ్యతా, సంస్కారం నేర్పగలిగే సామర్థ్యం మనకేఉందని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి  జగన్మోహనరెడ్డి బ్రాహ్మణ కార్పొరేషన్ పటిష్టం చెయ్యాలని,  అధిక నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో ఉన్నారు. రాజకీయ అవకాశాలు రావాలంటే ఆర్ధికంగా నిలదొక్కుకోవాలి తద్వారా అవకాశాలు అందిపుచ్చుకోవాలి. తెన్నేటి విశ్వనాధం గారి తర్వాత మానాన్నగారైన స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణగారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటుపడ్డారు అని శ్రీనివాస్ తెలిపారు.  

ఆ పునాదుల మీదే మేం జాగ్రత్త ముందుకు వెళ్తున్నాం అని ఆయన అన్నారు.విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ చేపట్టిన బృహత్తర ప్రణాళిక -2041 ద్వారా ఈ  మూడుజిల్లాల్లో సమగ్ర అభివృద్ధికి బాటలువేస్తుంది. దీనివల్ల  పరిశ్రమల స్థాపన, IT సెజ్ విస్తరణ, అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిచేయడం తద్వారా ఉత్పత్తి పెరగడం, యువతకు ఉపాధిఅవకాశాలు పెరగడం జరుగుతుందని ఆయన అన్నారు.

తెలగాణ్య బ్రాహ్మణ అభ్యుదయ సమాజం అధ్యక్షులు వెల్లంకి భానుమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కన్వీనర్ గాడేపల్లి ప్రభాకర్రావు వెంకట రామం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Satyam NEWS

6129 కొనుగోలు కేంద్రాల ద్వారా 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

Satyam NEWS

కామారెడ్డి జిల్లా రద్దు చేస్తే కాంగ్రెస్ భూస్థాపితమే

Satyam NEWS

Leave a Comment