34.7 C
Hyderabad
May 5, 2024 01: 00 AM
Slider చిత్తూరు

టిటిడి ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురండి

#RTI Act

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి వార్షిక బడ్జెట్ సుమారు 3 వేల కోట్లు ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. టీటీడీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిల్లి గవ్వ కూడా కేటాయించదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు టీటీడీ నిర్మించే దేవాలయాలు గాని, ఉద్యోగస్తులకు జీతభత్యాలతో సహా ఖర్చు చేసే ప్రతి పైసా కూడా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలే.

శ్రీవారికి భక్తులు సమర్పించిన ప్రతి పైసాకు జవాబు దారితనంగా వ్యవహరించాల్సిన బాధ్యత టిటిడి ఉన్నతాధికారుల మీద ధర్మకర్తల మండల మీద ఉంది. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఎంత ఖర్చు పెడుతున్నారు?

అని అడిగే హక్కు భక్తులకు ఉంది. తిరుమలలోని సేవా టికెట్ల మంజూరి కార్యాలయంలో విఐపి,ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలతో పాటు టీటీడీ ఛానల్ కు దాతలు ఇచ్చే డొనేషన్స్ లో అవకతవకలు జరిగాయన్న సమాచారంతో శ్రీవారి భక్తునిగా సమాచార హక్కు చట్టం కింద వాస్తవాలు తెలియజేయాలని అధికారులకు లేఖ రాయడం జరిగింది కానీ టీటీడీ ఆర్టీఐ పరిధిలోకి రాదని రిప్లై ఇవ్వడంపై త్వరలో కోర్టుని ఆశ్రయిస్తున్నానని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో వింత పోకడ…

1) భక్తులు డొనేషన్ లు ఇచ్చినప్పుడు “ఆదాయపు పన్ను” మినహాయింపు ఇస్తారు
2)రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం “టీటీడీ బోర్డు నియామకాలు” చేపడతారు
3) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి డిప్యూటేషన్ పై అధికారులను తీసుకువస్తారు
4) టీటీడీ ఉద్యోగస్తులకు అదనపు సౌకర్యాల కోసం ప్రభుత్వ అనుమతిని కోరుతారు
…. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అమలవుతున్న సమాచార హక్కు చట్టం మాత్రం టీటీడీ లో అమలు చేయకపోవడంలోని ఆంతర్యం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.

శ్రీవారి భక్తునిగా తాను 30 సంవత్సరాలుగా గోవిందా మాల వేసి కాలినడకన ప్రతి సంవత్సరం ముడుపు రూపంలో కానుకలు సమర్పించడం ఆనవాయితీ ఈ సంవత్సరం అన్నదానానికి లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది.

వేలాది మంది భక్తులు కోట్లాది రూపాయలు శ్రీవారికి కానుకలుగా సమర్పిస్తున్నారు ఆ నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటున్నారా దుర్వినియోగం చేస్తున్నారా అని ప్రశ్నించే హక్కు ప్రతి భక్తునికి ఉంటుంది టీటీడీలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తానని శ్రీవారి భక్తుల చేతిలో సమాచార హక్కు చట్టం “బ్రహ్మాస్త్రం” లాంటిదని త్వరలో హైకోర్టుని అవసరమైతే సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాను అని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ఎన్నికలు ప్రారంభానికి ముందు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలని టార్గెట్ చేయడానికి టిటిడి ని భూచిగా చూపి హిందువుల మనోభావాలను ఓట్లగా మలుచుకోవడం ఆనవాయితీగా మారింది గతంలో “పింక్ డైమండ్” మాయమైందని చెప్పారు రెండు కోట్ల శ్రీవారి నిధులు కోర్టు ఫీజు కింద కట్టారు ఇంకా కోర్టులో శ్రీవారి సొమ్ము అలాగే ఉంది ఇప్పుడు శ్రీవాణి టికెట్ల నిధుల పై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో రెగ్యులర్ ఉద్యోగస్తుల ప్రమోషన్ల సమస్య పరిష్కారం కాకుండా కోర్టులను ఆశ్రయించే పరిస్థితులు కల్పిస్తున్నారని ఇంటి స్థలాల విషయము నత్తనడకన కొనసాగుతుందని,ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగస్తుల పరిస్థితి గాలిలో దీపంలా మారిందన్నారు.

టీటీడీకి ఇప్పటి వరకు ఈవో గా చేసిన IAS జవహర్ రెడ్డి బదిలీ అయ్యి నెలలు గడుపుతున్నా ఇప్పటివరకు రెగ్యులర్ ఈఓ ని నియమించకపోవడంతో అనేక కీలక విభాగాలు ఇన్చార్జి పాలనలో కొనసాగుతూ పని ఒత్తిడి కారణంగా సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని ముఖ్యమంత్రి చొరవ తీసుకుని రెగ్యులర్ ఈఓ ని వెంటనే నియమించి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న రెగ్యులర్,అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ ఉద్యోగస్తుల సమస్యలతో పాటు భక్తుల మనోభావాలను గౌరవించాలన్నారు.

తిరుమల “శ్రీవారి ప్రోటోకాల్” దర్శనాలను దుర్వినియోగం చేస్తున్న అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు బోర్డు సభ్యుల పేర్లను టీటీడీ చైర్మన్,ఇంచార్జ్ ఈవో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

నకిలీ పురుగుమందులతో రైతులకు తీరని నష్టం

Satyam NEWS

క్రైస్తవ మిషనరీల సేవలు అభినందనీయం

Satyam NEWS

సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. రూ.25 కోట్ల హెరాయిన్‌ సీజ్

Sub Editor

Leave a Comment