38.2 C
Hyderabad
April 28, 2024 19: 21 PM
Slider గుంటూరు

నకిలీ పురుగుమందులతో రైతులకు తీరని నష్టం

mastan vali

నకిలీ విత్తనాలు పురుగు మందులతో రైతులకు వేలాది రూపాయల నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎంఐఎం పార్టీ రాష్ట్ర నాయకుడు మస్తాన్ వలి అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో చీమల మర్రి గ్రామ రైతులతో కలసి ఎంఐఎం పార్టీ నాయకులు, బీసీ సంఘాలు, మహిళ సంఘాలు ధర్నా చేశాయి.

తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వారు వ్యవసాయ శాఖ ఏడి మస్తానమ్మకు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా  మస్తాన్ వలి మాట్లాడుతూ 5 సంవత్సరాల నుంచి వర్షాలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడి రైతులకు కొంత ఊరట లభిస్తుంది అనుకునేలోపే నకిలీ విత్తనాల రూపం లో మరల వారికీ కష్టం వచ్చిందని అన్నారు.

ఇప్పుడైనా ప్రభుత్వం నకిలీ విత్తనాల బారి నుంచి రైతులను కాపాడి వారికి జరిగిన నష్టానికి నష్ట పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఎంఐఎం పార్టీ నాయకులు మౌలాలి రియాజ్ ఆరిఫ్ మసూద్ జక్రియ మాదాల నాగూర్ బీసీ నాయకులు బధుగుణాల శ్రీను బాలాజీ, మహిళా సంఘం నాయకురాలు ఎం అనిలా చీమల మర్రి గ్రామ రైతులు పాల్గొన్నారు.

Related posts

డిసెంబర్ 29న జరిగే వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ సభ

Murali Krishna

వీర సైనికులకు దేశప్రజలంతా అండగా ఉండాలి

Satyam NEWS

`జాన‌కిరామ్ ` సెన్సార్ పూర్తి: విడుద‌ల‌కు సిద్ధం

Satyam NEWS

Leave a Comment