Slider కృష్ణ

బ్రాడ్ బ్యాండ్ సేవల కోసం ఏపిలో ప్రత్యేక విభాగం

#MekapatiGowtamReddy

కరోనా కారణంగా వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఏపీకి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, ఉద్యోగుల కోసం బ్రాడ్ బ్యాండ్ సేవలు విస్తరించాలని  రాష్ట్ర  ఐటి శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి నిర్ణయించారు.

ముఖ్యంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు కరోనా బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చని వారి వారి ఇంటి నుంచే తమ విధులు నిర్వహిస్తున్నారు.

ఈ విధంగా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, వివిధ హోదాలో పనిచేసే ఉద్యోగులు ఇంటర్నెట్ సేవల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి ప్రభుత్వం దృష్టికి వచ్చింది.  

ఉద్యోగులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా వారికి బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి తేవాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది.

ఈ బ్రాడ్ బ్యాండ్ సేవలు కావాలనుకునే వారు https://broadband.apit.ap.gov.in/ లింకు ద్వారా సంప్రదించవచ్చు. సంబంధిత అధికారులు స్పందించి సత్వరమే  సేవలు అందిస్తారు.

Related posts

విశాఖ ఉక్కు ఉద్యమంలో ఇక చురుకుగా జనసేన పార్టీ

Satyam NEWS

పెద్ద గట్టు జాతరకు భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం

Bhavani

వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment