37.2 C
Hyderabad
May 6, 2024 12: 23 PM
Slider కరీంనగర్

హుజూరాబాద్ లో వందల ఎకరాల్లో పంట నష్టం

#MalluBhattiVikramarka

ఇటీవల కురిసిన భారీ వర్షాలు అన్నదాతలకు అపార నష్టం కలిగించాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండల పరిధిలోని కృష్ణాపూర్ తోపాటు పలు గ్రామాల్లో పంట పొలాలు నీటమునిగాయి. ఆరుగాలం కష్టించిన పంట తమ కళ్లముందే నీటిలో మునిగిపోవడంతో బోరున విలపించారు రైతులు.

ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బృందం ఆధ్వర్యంలో చేపట్టిన ఆస్పత్రుల సందర్శన యాత్రలో భాగంగా వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను కూడా పరిశీలించారు. కొద్దిపాటి వర్షానికే వరదలు వచ్చి పంటలు దెబ్బతింటున్నాయని భట్టికి తమ గోడును వెళ్లబోసుకున్నారు.

ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. వర్షాలు..వరదలకు దెబ్బతిన పంట పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలిని..అన్నదాతలను ఆదుకోవాలని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

Related posts

గణనాయకుని శుభాశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

Satyam NEWS

సంక్షేమ పథకాల కారణంగా ఆత్మగౌరవంతో జీవనం

Satyam NEWS

వైఎస్ విజయలక్ష్మి సమావేశానికి మెగాస్టార్ నో

Satyam NEWS

Leave a Comment